'సార్ ఎంతిస్తుంది..?'..... ఆనంద్ మహీంద్రా రిప్లైకి ఫిదా అయిన నెటిజెన్స్..!

మన దేశంలోని బిజినెస్ టైకూన్లలో ఆనంద్ మహీంద్ర కూడా ఒకరు. మహీంద్రా గ్రూప్ చైర్మన్‌గా అందరికీ సుపరిచితమే. ఇక ఈయన ట్విట్టర్‌లో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. సామాన్యుడు ట్వీట్ చేసినా రిప్లై ఇస్తుంటారు. అంతే కాదు అతని ట్వీట్లలో, రిప్లైలలో చమత్కారం ఎక్కువగా ఉంటుంటుంది. అందుకే మిగతా వ్యాపారవేత్తల కన్నా ఆనంద్ మహీంద్రాకు సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్ ఎక్కువ. ఇక అసలు విషయానికి వస్తే.. మహీంద్ర గ్రూప్ కంపెనీకి చెందిన ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ […]

Advertisement
Update:2019-03-08 13:46 IST

మన దేశంలోని బిజినెస్ టైకూన్లలో ఆనంద్ మహీంద్ర కూడా ఒకరు. మహీంద్రా గ్రూప్ చైర్మన్‌గా అందరికీ సుపరిచితమే. ఇక ఈయన ట్విట్టర్‌లో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. సామాన్యుడు ట్వీట్ చేసినా రిప్లై ఇస్తుంటారు. అంతే కాదు అతని ట్వీట్లలో, రిప్లైలలో చమత్కారం ఎక్కువగా ఉంటుంటుంది. అందుకే మిగతా వ్యాపారవేత్తల కన్నా ఆనంద్ మహీంద్రాకు సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్ ఎక్కువ.

ఇక అసలు విషయానికి వస్తే.. మహీంద్ర గ్రూప్ కంపెనీకి చెందిన ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పిన్నిఫరీనా కొత్తగా బతిస్తా అనే లగ్జరీ స్పోర్ట్స్ కారును జెనీవా మోటర్ షోలో ప్రదర్శంచింది. ఈ బతిస్తా మోడల్ ధర్ 2 మిలియన్ డాలర్లు. ఇది ఫార్ములా 1 కార్లకంటే అత్యధిక వేగంతో దూసుకెళ్తుందనే ప్రచారం జరగడంతో అందరి కళ్ళు ఆ కారుపై పడ్డాయి. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ కూడా ఈ కారు విశేషాలతో కూడిన ఒక వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు.

ఈ వీడియోను చూసిన వాళ్లందరూ వావ్, వావ్ అంటూ మెచ్చుకున్నారు. అయితే ఒక నెటిజన్ మాత్రం… సార్, కిత్నా దేతీ హై.? (మైలేజీ ఎంతిస్తుందని అతని ఉద్దేశం) అంటూ కామెంట్ చేశాడు. దీన్ని చూసిన ఆనంద్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు.

సర్ జీ, ఎలక్ట్రిక్ హై.. షాక్ దేతీ (సార్, ఇది ఎలక్ట్రిక్ కారు, షాక్ ఇస్తుంది) అంటూ తనదైన శైలిలో జవాబిచ్చారు. ఈ రిప్లై వైరల్‌గా మారింది. తన కంపెనీ కారును ప్రమోట్ చేసుకోవడమే కాక తనదైన శైలిలో ఆనంద్ మహీంద్ర ఇచ్చిన రిప్లై చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

ఇక ఈ కారు విషయానికి వస్తే.. పూర్తిగా ఎలక్ట్రిక్ కారైన బతిస్తాను హైపర్ కారని పినీ ఫరీనా పిలుస్తోంది. కేవలం 150 బతిస్తాలు మాత్రమే తయారు చేశారంటా. వంద కిలోమీటర్ల వేగాన్ని కేవలం రెండు సెకెన్లలో అందుకోవడం ఈ కారు ప్రత్యేకత.

Tags:    
Advertisement

Similar News