సాహో ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రారంభం
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో సినిమా దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టుంది. తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏరియా వైజ్ చేసే థియేట్రికల్ బిజినెస్ ను పక్కనపెట్టి, మిగతా లావాదేవీల్ని పూర్తిచేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ డీల్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, సాహో ఓవర్సీస్ హక్కులు 42 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయట. అది కూడా చైనా హక్కులు కాకుండా. అవును.. చైనాలో […]
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో సినిమా దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టుంది. తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏరియా వైజ్ చేసే థియేట్రికల్ బిజినెస్ ను పక్కనపెట్టి, మిగతా లావాదేవీల్ని పూర్తిచేయాలని మేకర్స్ నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ డీల్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, సాహో ఓవర్సీస్ హక్కులు 42 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయట. అది కూడా చైనా హక్కులు కాకుండా. అవును.. చైనాలో విడుదల కోసం ప్రత్యేకంగా ఓ బడ్జెట్ ను కేటాయించారు మేకర్స్.
మరోవైపు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం దాదాపు నెల రోజులుగా చర్చలు సాగుతూనే ఉన్నాయి. అన్ని భాషలు కలుపుకొని డిజిటల్, శాటిలైట్ హక్కులు కింద 90 కోట్ల రూపాయలు ఆశిస్తున్నారు నిర్మాతలు. కానీ ఛానెళ్లు మాత్రం అంత బెట్టింగ్ కాయడానికి సిద్ధంగా లేవు. ప్రస్తుతానికైతే చర్చలు 50 కోట్ల రూపాయలకు అటుఇటుగా సాగుతున్నాయి.
మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ మాత్రం డిజిటల్ కోసం 15 కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది. నిర్మాతలకు మాత్రం ఒకే ఛానెల్ కు డిజిటల్, శాటిలైట్ కలిపి ఇవ్వాలని కోరికగా ఉంది. అలా రెండు బిజినెస్ లను ఒకేసారి క్లోజ్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతానికైతే ఓవర్సీస్ క్లోజ్ అయింది. మరో వారం రోజుల్లో శాటిలైట్ డీల్ క్లోజ్ చేయాలని చూస్తున్నారు.