నివేదా.... డైరెక్టర్స్ ని ఇలా ఇబ్బంది పెడుతుందట
నాని నటించిన “జెంటిల్ మన్” సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది నివేదా థామస్. ఆ సినిమాలో ఎంతో క్యూట్ గా నటించి తెలుగు ప్రేక్షకులని మెప్పించి అందరి దృష్టి తన వైపు తిప్పుకుంది. ఈ భామకి ప్రస్తుతానికి అయితే తెలుగులో మంచి ఆఫర్సే వస్తున్నాయి. ఇక నివేదా థామస్ లేటెస్ట్ గా నటించిన సినిమా “118”. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమాని కే.వి గుహన్ డైరెక్ట్ చేసాడు. అయితే ఈ […]
నాని నటించిన “జెంటిల్ మన్” సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది నివేదా థామస్. ఆ సినిమాలో ఎంతో క్యూట్ గా నటించి తెలుగు ప్రేక్షకులని మెప్పించి అందరి దృష్టి తన వైపు తిప్పుకుంది. ఈ భామకి ప్రస్తుతానికి అయితే తెలుగులో మంచి ఆఫర్సే వస్తున్నాయి.
ఇక నివేదా థామస్ లేటెస్ట్ గా నటించిన సినిమా “118”. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమాని కే.వి గుహన్ డైరెక్ట్ చేసాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నివేదా థామస్ డైరెక్టర్ గుహన్ ని బాగా ఇబ్బంది పెట్టిందట.
ఈ విషయం గురించి గుహన్ మాట్లాడుతూ “నివేదా థామస్ కి సెట్స్ లో ఒక షాట్ అయిపోగానే సైలెంట్ అయిపోదు. ఎందుకంటే తనకి నెక్స్ట్ సీన్ ఎం జరుగుతుందో అనేది కూడా ముందే తెలియాలి. ఏమైనా అంటే అప్పుడే కదా పర్ఫెక్షన్ వచ్చేది అంటూ చెప్పుకొచ్చేది. ప్రతి సీన్ నాతో క్లియర్ గా చెప్పించుకున్నాకే యాక్ట్ చేసేది. ఈ విషయంలో మాత్రం నివేత థామస్ ప్రతి ఒక్క డైరెక్టర్ ని ఇలా ఇబ్బంది పెట్టేస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు గుహన్.