118 మూవీ 4 రోజుల వసూళ్లు

అంతా ఊహించినట్టే జరిగింది. 118 సినిమా బ్రేక్ ఈవెన్ కు దగ్గరైంది. సినిమాలో కంటెంట్ లేకపోయినా, రొటీన్ కథ అయినప్పటికీ ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లే ఉండడంతో పాటు థియేటర్లలో మరో సినిమా పోటీలో లేకపోవడంతో కల్యామ్ రామ్ సినిమా నిలకడగా నడుస్తోంది. ట్రేడ్ ఊహించినట్టుగా కాకపోయినా మరో 2 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. విడుదలైన 4 రోజుల్లో బ్రేక్-ఈవెన్ అవుతుందని ట్రేడ్ ఊహించింది. కానీ శివరాత్రి హాలిడే ఎఫెక్ట్ ఈ సినిమాపై […]

Advertisement
Update:2019-03-05 13:00 IST

అంతా ఊహించినట్టే జరిగింది. 118 సినిమా బ్రేక్ ఈవెన్ కు దగ్గరైంది. సినిమాలో కంటెంట్ లేకపోయినా, రొటీన్ కథ అయినప్పటికీ ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లే ఉండడంతో పాటు థియేటర్లలో మరో సినిమా పోటీలో లేకపోవడంతో కల్యామ్ రామ్ సినిమా నిలకడగా నడుస్తోంది. ట్రేడ్ ఊహించినట్టుగా కాకపోయినా మరో 2 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది.

విడుదలైన 4 రోజుల్లో బ్రేక్-ఈవెన్ అవుతుందని ట్రేడ్ ఊహించింది. కానీ శివరాత్రి హాలిడే ఎఫెక్ట్ ఈ సినిమాపై పెద్దగా కనిపించలేదు. ప్రేక్షకులు పెద్దగా రాకపోవడంతో 4 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. మరో 2 రోజుల్లో ఈ సినిమా బ్రేక్-ఈవెన్ లోకి వచ్చి, ఈ వీకెండ్ నాటికి మూవీ లాభాల బాట పట్టే ఛాన్స్ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు (షేర్) ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 2.44 కోట్లు
సీడెడ్ – రూ. 0.85 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.61 కోట్లు
ఈస్ట్ – రూ. 0.30 కోట్లు
వెస్ట్ – రూ. 0.24 కోట్లు
గుంటూరు – రూ. 0.44 కోట్లు
కృష్ణా – రూ. 0.43 కోట్లు
నెల్లూరు – రూ. 0.13 కోట్లు

Tags:    
Advertisement

Similar News