టీడీపీకి ఓటేసినా.. జనసేనకు వేసినా ఒకటేనా!

జనసేన అధిపతి పవన్ కల్యాన్ తీరు ఏమీ మారలేదు. కొంత విరామం తర్వాత కూడా పవన్ గతంలో మాట్లాడినట్లుగానే ఇప్పుడు కూడా పాత మాటలే మాట్లాడాడు. మళ్ళీ కేవలం జగన్ ను లక్ష్యంగా చేసుకునే పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు. జగన్ ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం తప్పు అయినట్టుగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే పవన్ కల్యాణ్ ఇది వరకూ చాలా సార్లు తను ముఖ్యమంత్రి కావాలని అనుకున్నట్టుగా ప్రకటించుకున్నాడు. అంటే పవన్ ప్రకటించుకుంటే తప్పు కాదు.. […]

Advertisement
Update:2019-02-26 02:15 IST

జనసేన అధిపతి పవన్ కల్యాన్ తీరు ఏమీ మారలేదు. కొంత విరామం తర్వాత కూడా పవన్ గతంలో మాట్లాడినట్లుగానే ఇప్పుడు కూడా పాత మాటలే మాట్లాడాడు. మళ్ళీ కేవలం జగన్ ను లక్ష్యంగా చేసుకునే పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు. జగన్ ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం తప్పు అయినట్టుగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు.

అయితే పవన్ కల్యాణ్ ఇది వరకూ చాలా సార్లు తను ముఖ్యమంత్రి కావాలని అనుకున్నట్టుగా ప్రకటించుకున్నాడు. అంటే పవన్ ప్రకటించుకుంటే తప్పు కాదు.. జగన్ ప్రకటించుకుంటే తప్పు.

ఇక సాధారణంగా ఎవరైనా అధికార పక్షాన్ని విమర్శిస్తారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఎంతసేపూ ప్రతిపక్షం మీద పడుతున్నాడు. ఒకవేళ జగన్ అధికారంలో ఉండి ఉంటే ఆయనను విమర్శించినా అదొక ఎత్తు. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ జగన్ ను విమర్శించడం విడ్డూరమే. తెలుగుదేశం పార్టీని ఏమీ అనకుండా, ముఖ్యమంత్రి తీరును ఎక్కడా విమర్శించకుండా ఇలా తను పచ్చ పక్షమే అని పవన్ కల్యాణ్ నిరూపించుకొంటూ ఉన్నాడు.

ఈ పరిస్థితిని చూస్తూ ఉంటే.. ఎన్నికల సమయంలో కూడా పవన్ తీరులో ఎలాంటి మార్పు ఉండదనే అనుకోవాలి. అందుకే ఇప్పుడు కొత్త మాట వినిపిస్తోంది. ఈ రాజకీయంలో పవన్ కల్యాణ్ కు ఓటు వేసినా.. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా తేడా ఏమీ లేదని పలువురు అంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతున్న పవన్ కల్యాణ్.. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఆ పార్టీ మద్దతుదారుగానే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. కేవలం తెలుగుదేశం వ్యతిరేక ఓటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి పడకుండా చేసేందుకే పవన్ కల్యాణ్ ఈ హడావుడి అంతా చేస్తున్నాడని…. జనసేనకు ఓటేసినా, తెలుగుదేశానికి ఓటేసినా చంద్రబాబుకు అనుకూలంగా ఓటేసినట్టే అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు!

Tags:    
Advertisement

Similar News