బాలినేనిపై దాడి ఉదంతం.... వీఆర్‌కు సీఐ రాంబాబు

ఒంగోలు నగర పరిధిలోని కమ్మపాలెంలో నిన్న వైసీపీ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి, వైసీపీ శ్రేణులపై దాడి వ్యవహారంలో ఉన్నతాధికారులు స్పందించారు. ఒంగోలు టూటౌన్ సీఐ రాంబాబును జిల్లా ఎస్పీ వీఆర్‌కు పంపించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. కమ్మపాలెంలో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వైసీపీ నేతలు అన్ని ముందస్తు అనుమతులు తీసుకున్నారు. అయితే కార్యాలయం ప్రారంభించడానికి వీల్లేదంటూ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ అనుచరులు ఆందోళనకు దిగారు. కార్యాలయ ప్రారంభానికి వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డిపై రాళ్లు రువ్వారు టీడీపీ కార్యకర్తలు. ఆ సమయంలో టీడీపీ వారిని […]

Advertisement
Update:2019-02-26 04:12 IST

ఒంగోలు నగర పరిధిలోని కమ్మపాలెంలో నిన్న వైసీపీ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి, వైసీపీ శ్రేణులపై దాడి వ్యవహారంలో ఉన్నతాధికారులు స్పందించారు. ఒంగోలు టూటౌన్ సీఐ రాంబాబును జిల్లా ఎస్పీ వీఆర్‌కు పంపించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

కమ్మపాలెంలో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వైసీపీ నేతలు అన్ని ముందస్తు అనుమతులు తీసుకున్నారు. అయితే కార్యాలయం ప్రారంభించడానికి వీల్లేదంటూ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ అనుచరులు ఆందోళనకు దిగారు. కార్యాలయ ప్రారంభానికి వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డిపై రాళ్లు రువ్వారు టీడీపీ కార్యకర్తలు.

ఆ సమయంలో టీడీపీ వారిని అడ్డుకోవాల్సిన సీఐ రాంబాబు… తిరిగి వైసీపీ కార్యకర్తలపైనే లాఠీచార్జీ చేయించారు. పలువురు వైసీపీ కార్యకర్తలను విచక్షణరహితంగా పోలీసులు కొట్టారు. వైసీపీ కార్యాలయం ప్రారంభించకుండానే బాలినేనిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

ఈ ఘటనపై వైసీపీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పోలీసుల నుంచి అన్ని అనుమతులు తీసుకునే కార్యాలయం ప్రారంభించేందుకు వెళ్లామని కానీ సీఐ టీడీపీ నేతలకు వంతపాడి… వైసీపీ వారిపై లాఠీ చార్జ్ చేయించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపడంతో జిల్లా ఎస్పీ నష్టనివారణ చర్యలకు దిగారు. టీడీపీకి వంతపాడిన ఒంగోలు సీఐ రాంబాబును వీఆర్‌కు పంపారు. ఈ వ్యవహారంలో పోలీసుల పాత్రపై విచారణకు ఆదేశించారు.

Tags:    
Advertisement

Similar News