బాబును కట్టడి చేస్తున్న ఈసీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు తన ఇష్టానుసారంగా వ్యవహరించకుండా ఎన్నికల కమిషన్ కట్టడి చేస్తోందా? వివిధ జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా ఉన్న వారిని ఉన్నత అధికారులుగా నియమించి ఎన్నికల ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకునేలా ప్రయత్నాలు ప్రారంభించారని ఈసీ కనిపెట్టిందా? ఈ మధ్య జరిగిన పరిణామాలను గమనిస్తే ఇది నిజమేననిపిస్తోంది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తో పాటు […]

Advertisement
Update:2019-02-24 09:30 IST

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు తన ఇష్టానుసారంగా వ్యవహరించకుండా ఎన్నికల కమిషన్ కట్టడి చేస్తోందా? వివిధ జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా ఉన్న వారిని ఉన్నత అధికారులుగా నియమించి ఎన్నికల ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకునేలా ప్రయత్నాలు ప్రారంభించారని ఈసీ కనిపెట్టిందా? ఈ మధ్య జరిగిన పరిణామాలను గమనిస్తే ఇది నిజమేననిపిస్తోంది.

ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తో పాటు జనసేన కూడా ఆరోపణలు చేస్తోంది. తమకు నచ్చిన వారిని ఓటర్లుగా ఉంచి, నచ్చని వారిని ఓటర్ జాబితా నుంచి తొలగిస్తున్నారని ఈ రెండు పార్టీలు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాయి.

దీంతో నెల రోజుల క్రితం ఎన్నికల కమిషన్ అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారిగా ఉన్న సిసోడియాను ఆ స్థానం నుంచి బదిలీ చేయాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపింది. దానిని అనుసరించి ఏపీ ప్రభుత్వం సిసోడియా స్థానంలో ద్వివేదీ ని ఎన్నికల కమిషనర్ గా నియమించింది. పలు జిల్లాల్లో పర్యటిస్తున్న ఎలక్షన్ కమిషన్ ఉన్నతాధికారులు వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ఉన్నత అధికారుల పనితీరుపై అంచనాలు వేస్తున్నారు.

ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల కమిషన్ అధికారులకు ఆ జిల్లా కలెక్టర్ వి.రామారావు పని తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా గురించి గానీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాల గురించికానీ సమాచారం ఏదీ కలెక్టర్ రామారావు దగ్గర సక్రమంగా లేదంటూ మండిపడ్డారు. అయితే తాను కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించి కేవలం వారం రోజులు మాత్రమే అయిందని, అన్ని అంశాలను పూర్తిగా తెలుసుకుని త్వరలోనే పగడ్బందీ సమాచారంతో ముందుంటానని రామారావు ఎన్ని చెప్పినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు.

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఎన్నికల విధులకు పనికిరాడు అంటూ నిర్ణయించి ఆయనను అక్కడి నుంచి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తాకీదు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రామారావు ఈ మధ్యనే కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు అంటూ నివేదిక ఇచ్చినా ఎలక్షన్ కమిషన్ దాన్ని పట్టించుకోలేదు. రామారావును కలెక్టర్ బాధ్యతల నుంచి తప్పించి వేరొకరిని వెంటనే మార్చాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో తెలుగుదేశం ప్రభుత్వం విజయవాడ నగరపాలక కమిషనర్ గా ఉన్న నివాస్ ను అప్పటికప్పుడు శ్రీకాకుళం కలెక్టర్ గా బదిలీ చేసింది. ఆయన స్థానంలో అప్పటివరకు శ్రీకాకుళం కలెక్టర్ గా ఉన్న వి. రామారావును విజయవాడకు బదిలీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆగ్రహం వెనుక తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న కొన్ని అక్రమాలు వెలుగు చూశాయని, అందుకే ఎన్నికల కమిషన్ ఆగ్రహంతో ఉందని అటు అధికారులు, ఇటు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించాక మరింత మంది అధికారులను అటూ ఇటూ మార్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Tags:    
Advertisement

Similar News