పరమశివుడిగా అక్షయ్‌కుమార్
ఆయన లుక్‌ను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్ షేర్ చేసిన ’కన్నప్ప చిత్రబృందం
Advertisement
నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న సినిమా ’కన్నప్ప'. మహాభారత సిరీస్‌ను తెరకెక్కించిన ముఖేశ్‌కుమార్ సింగ్ డైరెక్షన్‌లో ఇది సిద్ధమౌతున్నది. ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఇందులో ఎంతో కీలకమైన పరమశివుడి పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ నటిస్తున్న విషయం విదితమే. తాజాగా ఆయన లుక్‌ను పరిచయం చేస్తూ చిత్రబృందం కొత్త పోస్టర్ షేర్ చేసింది. మహాదేవ్ పాత్రలో యాక్ట్ చేయడంపై అక్షయ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకెంతో ప్రత్యేకమన్నారు.
Advertisement