ప్రకాశ్‌రాజ్‌ను కించపరుస్తూ బీజేపీ ఎంపీ ట్వీట్.... అరెస్టు వారెంట్ జారీ

నటుడు ప్రకాశ్‌రాజ్‌ను కించపరుస్తూ ట్వీట్ చేసిన మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాను వెంటనే అరెస్టు చేసి తమ ముందు హాజరు పరచాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. 2017లో ప్రకాశ్ రాజ్‌పై ఎంపీ ప్రతాప్ ఒక ట్వీట్ చేశారు. దాంట్లో.. నీ కొడుకు చనిపోయిన బాధలో ఉండి.. భార్యను వదిలేసి, ఒక డ్యాన్సర్ వెంట పడుతున్నావు. నీవా మోడీ-యోగీని విమర్శించేది అంటూ కన్నడలో ట్వీట్ చేశారు. అప్పట్లో జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య అనంతరం మోడీపై ప్రకాశ్ […]

Advertisement
Update:2019-02-24 03:13 IST

నటుడు ప్రకాశ్‌రాజ్‌ను కించపరుస్తూ ట్వీట్ చేసిన మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాను వెంటనే అరెస్టు చేసి తమ ముందు హాజరు పరచాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. 2017లో ప్రకాశ్ రాజ్‌పై ఎంపీ ప్రతాప్ ఒక ట్వీట్ చేశారు. దాంట్లో.. నీ కొడుకు చనిపోయిన బాధలో ఉండి.. భార్యను వదిలేసి, ఒక డ్యాన్సర్ వెంట పడుతున్నావు. నీవా మోడీ-యోగీని విమర్శించేది అంటూ కన్నడలో ట్వీట్ చేశారు.

అప్పట్లో జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య అనంతరం మోడీపై ప్రకాశ్ రాజ్ విమర్శల వర్షం కురిపించారు. ఆ తర్వాత రోజే ఎంపీ ప్రతాప్ సింహ ఆయనను అవహేళన చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో ప్రకాశ్ రాజ్ ఎంపీపై కేసు వేశారు. అప్పుడే ప్రత్యేక కోర్టు తమ ముందు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.

అప్పటి నుంచి నేటి వరకు మూడు సార్లు సమన్లు జారీ చేసినా ఎంపీ ప్రతాప్ సింహా ఏనాడూ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీ పాటిల్ అరెస్టు వారెంట్ జారీ చేశారు. మైసూర్ పోలీస్ కమిషనర్ స్వయంగా వెళ్లి ఆయనను అరెస్టు చేసి తీసుకొని రావాలని ఆ ఆదేశాల్లో జడ్జి పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News