5 వేల రెస్టారెంట్లను తొలగించిన జొమాటో

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తమ లిస్ట్ నుంచి 5 వేల రెస్టారెంట్లను తొలగించినట్లు ఇవాళ వెల్లడించింది. fssai (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రమాణాలను సదరు రెస్టారెంట్లు అందుకోకపోవడమే దీనికి కారణమని జొమాటో ప్రతినిధులు స్పష్టం చేశారు. స్విగ్గీ, ఫుడ్ పాండా, ఊబర్ ఈట్స్ వంటి సంస్థలతో పోటీ పడుతున్న జొమాటోకు దేశవ్యాప్తంగా 150 నగరాలు, పట్టణాల్లోని 80 వేల రెస్టారెంట్లు, హోటల్స్, ఫుడ్ కోర్టులతో ఒప్పందాలు ఉన్నాయి. వినియోగదారులకు […]

Advertisement
Update:2019-02-23 11:38 IST

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తమ లిస్ట్ నుంచి 5 వేల రెస్టారెంట్లను తొలగించినట్లు ఇవాళ వెల్లడించింది. fssai (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రమాణాలను సదరు రెస్టారెంట్లు అందుకోకపోవడమే దీనికి కారణమని జొమాటో ప్రతినిధులు స్పష్టం చేశారు.

స్విగ్గీ, ఫుడ్ పాండా, ఊబర్ ఈట్స్ వంటి సంస్థలతో పోటీ పడుతున్న జొమాటోకు దేశవ్యాప్తంగా 150 నగరాలు, పట్టణాల్లోని 80 వేల రెస్టారెంట్లు, హోటల్స్, ఫుడ్ కోర్టులతో ఒప్పందాలు ఉన్నాయి. వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ప్రతీ సారి ఆయా రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో సరైన నాణ్యతా ప్రమాణాలను పాటించని 5వేల రెస్టారెంట్లను తమ యాప్ నుంచి తొలగించినట్లు జొమాటో పేర్కొంది.

మరోవైపు ప్రతీ వారం దాదాపు 400 కొత్త రెస్టారెంట్లతో జొమాటో ఒప్పందం కుదుర్చుకుంటోంది.

Tags:    
Advertisement

Similar News