కౌగిలింతపై రాహుల్ వివరణ
గతేడాది లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం రాహుల్ గాంధీ ప్రధాని మోడీ వద్దకు వెళ్లి కౌగిలించుకొన్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి ఈ ఘటనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ వివరణ ఇచ్చారు. ద్వేషానికి ప్రేమే సమాధానమని.. ఆయన జీవితంలో ప్రేమలేదని నాకు అనిపించిందని, అందుకే వెళ్లి కౌగిలించుకున్నానని రాహుల్ స్పష్టం చేశారు. ఇవాళ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో విద్యార్థులతో సమావేశమయ్యారు. […]
గతేడాది లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం రాహుల్ గాంధీ ప్రధాని మోడీ వద్దకు వెళ్లి కౌగిలించుకొన్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి ఈ ఘటనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ వివరణ ఇచ్చారు.
ద్వేషానికి ప్రేమే సమాధానమని.. ఆయన జీవితంలో ప్రేమలేదని నాకు అనిపించిందని, అందుకే వెళ్లి కౌగిలించుకున్నానని రాహుల్ స్పష్టం చేశారు. ఇవాళ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో విద్యార్థులతో సమావేశమయ్యారు. వారితో కొద్ది సేపు ముఖాముఖి చర్చ జరిపారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.
పుల్వామా ఉగ్రదాడి గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ఇలాంటి దాడుల కారణంగా జరిగే బాధ, నష్టం ఎలా ఉంటుందో తాను ప్రత్యక్షంగా అనుభవించానని అన్నారు. తన తండ్రిని, నానమ్మను ఇలాంటి ఘటనలే బలి తీసుకున్నాయని.. ఇలాంటి విద్వేషాలు ఏ మాత్రం ఫలితాలనివ్వవు.. కేవలం ప్రేమ మాత్రమే అన్నింటినీ జయించగలదని రాహుల్ వివరించారు.