బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌ రెడ్డి కన్నుమూత

భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన బద్దం బాల్‌రెడ్డి(73) కొద్ది సేపటి క్రితం కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇవాళ ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను కేర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా లాభం లేకపోయింది. పాతబస్తీలోని ఆలియాబాద్ జంగమ్మెట్ ప్రాంతంలో ఆయన జన్మించారు. గోల్కొండ టైగర్‌గా పేరు పొందిన బద్దం బాల్ రెడ్డి పాతబస్తీలో బీజేపీ ఎదుగుదలకు ఎంతో […]

Advertisement
Update:2019-02-23 11:16 IST

భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన బద్దం బాల్‌రెడ్డి(73) కొద్ది సేపటి క్రితం కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇవాళ ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను కేర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా లాభం లేకపోయింది.

పాతబస్తీలోని ఆలియాబాద్ జంగమ్మెట్ ప్రాంతంలో ఆయన జన్మించారు. గోల్కొండ టైగర్‌గా పేరు పొందిన బద్దం బాల్ రెడ్డి పాతబస్తీలో బీజేపీ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు. ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఓవైసీకి ఆయన ఎంతో పోటీని ఇచ్చారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

అయితే అంతకు మునుపు పాతబస్తీలోని కార్వాన్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 1985, 1989, 1994లో వరుసగా మూడు సార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004లో ఆయనపై ఐఎస్ఐతో సంబంధం ఉన్న కొంత మంది హత్యాయత్నం చేశారు. ఈ కేసుకు సంబంధించి సయ్యద్ జకీర్ రహీం అనే వ్యక్తిని 2017లో అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఫర్హత్ ఉల్లా ఘోరీ ఇంకా పరారీలోనే ఉన్నాడు.

బాల్‌రెడ్డికి గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్న సమయంలోనే ఆయన అనంత లోకాలకు వెళ్లారు. బాల్‌రెడ్డి మృతి వార్త తెలుసుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నేత కిషన్‌రెడ్డి హుటాహుటిన కేర్ ఆసుపత్రికి చేరుకున్నారు.

Tags:    
Advertisement

Similar News