మీరు నీళ్లు ఆపితే మాకొచ్చే నష్టం లేదు : పాకిస్తాన్

పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ పలు విషయాల్లో పాకిస్తాన్‌పై పరోక్ష యుద్దం చేస్తోంది. తొలుత ఎంఎన్ఎఫ్ స్టేటస్ ఉపసంహరించి.. ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాన్ని 200 శాతానికి పెంచింది. ఇక నిన్న సింధూ నదీజలాల ఒప్పందం కింద భారత్‌కు రావల్సిన వాటాను ఇకపై పాకిస్తాన్‌కు వెళ్లకుండా అడ్డుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ప్రకటించారు. నితిన్ గడ్కరి ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ ఈ విషయంపై స్పందించింది. సింధూ నదీ జలాలు ఆపినంత మాత్రాన […]

Advertisement
Update:2019-02-22 10:10 IST

పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ పలు విషయాల్లో పాకిస్తాన్‌పై పరోక్ష యుద్దం చేస్తోంది. తొలుత ఎంఎన్ఎఫ్ స్టేటస్ ఉపసంహరించి.. ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాన్ని 200 శాతానికి పెంచింది. ఇక నిన్న సింధూ నదీజలాల ఒప్పందం కింద భారత్‌కు రావల్సిన వాటాను ఇకపై పాకిస్తాన్‌కు వెళ్లకుండా అడ్డుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ప్రకటించారు.

నితిన్ గడ్కరి ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ ఈ విషయంపై స్పందించింది. సింధూ నదీ జలాలు ఆపినంత మాత్రాన మాకు వచ్చే నష్టమేమీ లేదని ఆ దేశ నీటిపారుదల కార్యదర్శి ఖ్వాజా షుమాలీ ప్రకటించారు. పాక్‌లో వెలువడే ‘డాన్’ పత్రికతో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

తూర్పు ప్రాంతం నుంచి ప్రవహించే నదుల నీటిని మళ్లించడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే పాకిస్తాన్ ఉపయోగించుకునే సింధు, జీనం, చీనాబ్ నదుల నీటిని మళ్లిస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయని అన్నారు. ఈ విషయంపై తప్పకం అభ్యంతరం వ్యక్తం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

గతంలో కూడా తూర్పు నుంచి ప్రవహించే నదుల నీటిని భారత్ మళ్లించిందని.. కాని అప్పుడు మేం అభ్యంతరం తెలపలేదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కాగా, గతంలో సింధూ నదీ జల ఒప్పందం కింద ఆరు నదుల జలాల వాటాను భారత్, పాకిస్తాన్ పంచుకున్నాయి. సింధు, జీలం, చీనాబ్ పాకిస్తాన్‌కు దక్కగా.. రావి, బియాస్, సట్లెజ్ నదులపై అధికారం భారత్‌కు దక్కింది.

Tags:    
Advertisement

Similar News