పాకిస్థాన్‌ పై తాలిబాన్ల ప్రతీకారదాడులు

వెల్లడించిన అఫ్ఘాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ

Advertisement
Update:2024-12-28 19:17 IST

పాకిస్థాన్‌ పై తాలిబాన్‌ సేనలు ప్రతీకారదాడులు చేశాయి. పాక్‌ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని తమ సేనలు దాడులకు దిగాయని అఫ్ఘానిస్థాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనాయతుల్లా క్వార్జామి సోషన్‌ మీడియాలో ప్రకటించారు. ఇటీవల అఫ్ఘానిస్థాన్‌ పై పాక్‌ వాయుసేన వైమానిక దాడులు చేసింది. వాటికి ప్రతీకారంగా తాలిబాన్లు చేసిన దాడిలో 19 మంది పాక్‌ సైనికులు మరణించారని అక్కడి మీడియా సంస్థ తన కథనంలో వెల్లడించింది. అఫ్ఘానిస్థాన్‌ ను తాలిబాన్లు ఆక్రమించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పాక్‌, అఫ్ఘాన్‌ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్ఘాన్‌ దాడులపై పాకిస్థాన్‌ ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

Tags:    
Advertisement

Similar News