3 డిఫరెంట్ గెటప్స్ లో నాని

కెరీర్ లో చాలా సినిమాలు చేశాడు. ఎన్నో హిట్స్ అందుకున్నాడు. కానీ నానిలో మేకోవర్ ఎప్పుడైనా చూశారా? ఈ ప్రశ్నకు ‘లేదు’ అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఎన్ని సినిమాలు చేసినా లుక్ లో పెద్దగా మార్పు చూపించలేదు నాని. ఇన్నాళ్లకు నేచురల్ స్టార్ కు ఆ టైమ్ వచ్చింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలో 3 డిఫరెంట్ గెటప్స్ లో కనువిందు చేయబోతున్నాడట నాని. ఇందులో ఒకటి టీనేజ్ కుర్రాడి […]

Advertisement
Update:2019-02-20 00:32 IST

కెరీర్ లో చాలా సినిమాలు చేశాడు. ఎన్నో హిట్స్ అందుకున్నాడు. కానీ నానిలో మేకోవర్ ఎప్పుడైనా చూశారా? ఈ ప్రశ్నకు ‘లేదు’ అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఎన్ని సినిమాలు చేసినా లుక్ లో పెద్దగా మార్పు చూపించలేదు నాని. ఇన్నాళ్లకు నేచురల్ స్టార్ కు ఆ టైమ్ వచ్చింది.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలో 3 డిఫరెంట్ గెటప్స్ లో కనువిందు చేయబోతున్నాడట నాని. ఇందులో ఒకటి టీనేజ్ కుర్రాడి గెటప్. కాగా ఇంకోటి మధ్యవయసున్న పాత్ర. ఇక మూడోది ముసలాడి పాత్ర. ఈ మూడు గెటప్స్ లో నడివయష్కుడి పాత్ర పోషించడం నానికి కొత్త కాకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం జెర్సీ సినిమాలో అలాంటి పాత్రనే పోషించాడు.

ఎటొచ్చి మిగతా 2 పాత్రలతోనే సమస్య. అందుకే ఈ రెండు పాత్రలపై ప్రత్యేకంగా హోం వర్క్ చేయాలని నిర్ణయించుకున్నాడు నాని. మేకప్ తో గెటప్ లో మార్పులు తీసుకొచ్చినా యాక్టింగ్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలపైనే నాని ఇప్పుడు ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతానికైతే చిన్న చిన్న సన్నివేశాల షూటింగ్ తోనే సరిపెట్టారు. వచ్చే వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ఊపందుకుంటుంది.

Tags:    
Advertisement

Similar News