అల్లు అర్జున్ కి ఇంకా సమయం కావాలట....
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా” లాంటి ఫ్లాప్ తరువాత చాలా గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేసాడు. ఇప్పటికే అధికారికంగా ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించారు. ఈ సినిమా పూజా కార్యక్రమం త్వరలో జరగనుంది. ఇకపోతే గత ఏడాది చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ చాలా వెయిట్ పెరిగిపోయాడు. అందుకే త్రివిక్రమ్ తన సినిమా కోసం అల్లు అర్జున్ ని వెయిట్ […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా” లాంటి ఫ్లాప్ తరువాత చాలా గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేసాడు.
ఇప్పటికే అధికారికంగా ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించారు. ఈ సినిమా పూజా కార్యక్రమం త్వరలో జరగనుంది. ఇకపోతే గత ఏడాది చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ చాలా వెయిట్ పెరిగిపోయాడు. అందుకే త్రివిక్రమ్ తన సినిమా కోసం అల్లు అర్జున్ ని వెయిట్ తగ్గమని చెప్పాడట. అందుకు తగట్టుగానే అల్లు అర్జున్ కసరత్తులు కూడా స్టార్ట్ చేసాడు.
కానీ అల్లు అర్జున్ మాత్రం అనుకున్న టైం లో మళ్ళీ తన ఫిట్నెస్ ని తెచ్చుకోలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ ని మరో రెండు నెలలు సమయం అడిగాడట. ఈ రెండు నెలల తరువాత సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేద్దామని అల్లు అర్జున్ కోరాడట.
గీత ఆర్ట్స్, హారిక హాసిని వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయి.