కేంద్రమంత్రి సెల్ఫీపై నెటిజన్ల ఆగ్రహం!

కేంద్రమంత్రి ఆల్ఫోన్స్ కన్నన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన సీఆర్పీఎఫ్ జవాన్ వసంతకుమార్ కు అంతిమ నివాళలర్పించే సమయంలో….ఆ జవాన్ శవపేటిక వద్ద తీసుకున్న సెల్ఫీని ఆల్ఫోన్స్ కన్నన్ సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వివాదస్పదంగా మారింది. ఈ సెల్ఫీపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అమర జవాను శవపేటిక ముందు సెల్ఫీలు తీసుకోవడమేంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే నెటిజన్ల విమర్శలకు మంత్రి సమాధానం ఇచ్చారు. గత 40 సంవత్సరాలుగా ప్రజాక్షేతంలో ఉంటున్నా. విధులను […]

Advertisement
Update:2019-02-18 05:30 IST

కేంద్రమంత్రి ఆల్ఫోన్స్ కన్నన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన సీఆర్పీఎఫ్ జవాన్ వసంతకుమార్ కు అంతిమ నివాళలర్పించే సమయంలో….ఆ జవాన్ శవపేటిక వద్ద తీసుకున్న సెల్ఫీని ఆల్ఫోన్స్ కన్నన్ సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వివాదస్పదంగా మారింది. ఈ సెల్ఫీపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అమర జవాను శవపేటిక ముందు సెల్ఫీలు తీసుకోవడమేంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

అయితే నెటిజన్ల విమర్శలకు మంత్రి సమాధానం ఇచ్చారు. గత 40 సంవత్సరాలుగా ప్రజాక్షేతంలో ఉంటున్నా. విధులను నిర్వరిస్తూ…ప్రజల కోసం పనిచేస్తున్నారు. నా దేశభక్తిని ప్రశ్నించేవారికి సమాధానం చెబుతున్నాను. నాకు ఎలాంటి హోదానో…మంత్రి పదవో అవసరం లేదు. నా తండ్రి సైనికుడే. ఆ బాధ అందరికంటే ఎక్కువ నాకు తెలుసు. దేశం కోసం, మన కోసం ప్రాణాలు త్యాగం చేసిన జవానులకు వందనం తెలుపుతున్నా…అని అన్నారు.

గతంలో కూడా కేరళలో వరదలు వచ్చినప్పుడు కూడా ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారాయన. పునరావస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులతో నిద్రిస్తూ సెల్ఫీలు తీసుకున్నారు. ఆ సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి….వివాదాస్పదమయ్యారు.

Tags:    
Advertisement

Similar News