ఆర్మీ అదుపులో పుల్వామా దాడి కీలక సూత్రధారి?
గతవారం కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపుర సమీపంలో జైష్ ఏ మహ్మద్ సంస్థకు చెందిన తీవ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడిలో 44 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఆర్మీ ఈ దాడికి సంబంధించిన కీలక సూత్రధారులను వెతికే పనిలో పడింది. కీలక సమాచారం లభించడంతో ఇవాళ తెల్లవారుజామున పుల్వామా జిల్లాలోని పింగ్లాంగ్ వద్దకు భద్రతా దళాలు వెళ్లాయి. అక్కడ ఉగ్రవాదులకు, ఆర్మీకి మధ్య ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ […]
గతవారం కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపుర సమీపంలో జైష్ ఏ మహ్మద్ సంస్థకు చెందిన తీవ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడిలో 44 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఆర్మీ ఈ దాడికి సంబంధించిన కీలక సూత్రధారులను వెతికే పనిలో పడింది.
కీలక సమాచారం లభించడంతో ఇవాళ తెల్లవారుజామున పుల్వామా జిల్లాలోని పింగ్లాంగ్ వద్దకు భద్రతా దళాలు వెళ్లాయి. అక్కడ ఉగ్రవాదులకు, ఆర్మీకి మధ్య ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.
ఈ క్రమంలోనే ఉగ్రదాడికి కీలక సూత్రధారి అయిన జైష్ ఏ మహ్మద్ కమాండర్ కమ్రాన్ ఆర్మీ చేతికి చిక్కినట్లు సమాచారం. కమ్రాన్‌తో పాటు మరో ముగ్గురు తీవ్రవాదులు ఒక ప్రాంతంలో నక్కినట్లు తెలుసుకొని ఆర్మీ అక్కడకు చేరుకుంది.
అక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఆర్మీ మేజర్, ముగ్గురు జవాన్లు, ఒక పౌరుడు మృతి చెందాడు.