మూసివేత దిశ‌గా బీఎస్ఎన్ఎల్‌.... కార‌ణం ఇదే....

ప్ర‌భుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సంక్షోభంలో చిక్కుకుంది. వేల కోట్ల న‌ష్టాల‌తో కోలుకోలేని ప‌రిస్థితికి వ‌చ్చింది. ప్ర‌భుత్వానికి త‌ల‌కు మించిన భారంగా ఈ సంస్థ‌ నిర్వాహ‌ణ త‌యారైంది. దాంతో ఈ ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌భుత్వం అనేక మార్గాల‌ను అన్వేషిస్తోంది. ప‌లు కార‌ణాల వ‌ల్ల బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారుల న‌మ్మ‌కాన్ని కోల్పోతూ వ‌స్తోంది. 2017-18 ముగింపునాటికి బీఎస్ఎన్ఎల్ న‌ష్టాలు ఏకంగా 31వేల 287 కోట్ల‌కు చేరాయి. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో అతి దారుణ‌మైన న‌ష్టాల‌ను చ‌విచూస్తున్న కంపెనీ ఇదే. ఈ నేప‌థ్యంలో బీఎస్ఎన్ఎల్ టాప్ ఆఫీస‌ర్‌తో కేంద్ర ప్ర‌భుత్వం […]

Advertisement
Update:2019-02-14 02:25 IST

ప్ర‌భుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సంక్షోభంలో చిక్కుకుంది. వేల కోట్ల న‌ష్టాల‌తో కోలుకోలేని ప‌రిస్థితికి వ‌చ్చింది. ప్ర‌భుత్వానికి త‌ల‌కు మించిన భారంగా ఈ సంస్థ‌ నిర్వాహ‌ణ త‌యారైంది. దాంతో ఈ ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌భుత్వం అనేక మార్గాల‌ను అన్వేషిస్తోంది. ప‌లు కార‌ణాల వ‌ల్ల బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారుల న‌మ్మ‌కాన్ని కోల్పోతూ
వ‌స్తోంది.

2017-18 ముగింపునాటికి బీఎస్ఎన్ఎల్ న‌ష్టాలు ఏకంగా 31వేల 287 కోట్ల‌కు చేరాయి. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో అతి దారుణ‌మైన న‌ష్టాల‌ను చ‌విచూస్తున్న కంపెనీ ఇదే. ఈ నేప‌థ్యంలో బీఎస్ఎన్ఎల్ టాప్ ఆఫీస‌ర్‌తో కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రిపింది. ప‌రిస్థితి నుంచి గ‌ట్టెందుకు వివిధ మార్గాల‌ను అన్వేషించాల‌ని ఆదేశించింది. అవ‌స‌ర‌మైతే సంస్థ
మూసివేతను కూడా ఒక ఆప్ష‌న్‌గా పెట్టుకుంది.

సంస్థ సామ‌ర్ధ్యానికి మించి ఉద్యోగులు ఉన్న నేప‌థ్యంలో వారి రిటైర్ మెంట్ వ‌య‌సును త‌గ్గించ‌డం, వాలంట‌రీ రిటైర్‌మెంట్ అమ‌లు చేయ‌డం వంటివి చేయాల‌ని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. ఇలా చేయ‌డం ద్వారా వేల కోట్ల
రూపాయ‌ల‌ జీతాలు మిగులులో ఆదా అవుతుంది.

క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్రైవేట్ టెలికాం సంస్థ‌లు ఎదురెళ్లి స్వాగ‌తం ప‌లుకుతుంటే… బీఎస్ఎన్ఎల్ మాత్రం ఉన్న క‌స్ట‌మ‌ర్ల‌ను, సంస్థ‌ను అభిమానించే వినియోగ‌దారుల మ‌న‌సు కూడా గెల‌వ‌లేక‌పోతుంద‌న్న భావ‌న ఉంది. ఇందుకు కొంద‌రు ఉద్యోగుల నిర్ల‌క్ష్యం, ఉద్యోగానికి వ‌చ్చిన ఇబ్బంది ఏమీ లేదులే అన్న ధోర‌ణే కార‌ణ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు.
సంస్థ‌లో స‌గం మంది అంటే 33వేల 846 మందిని వీఆర్ఎస్ ద్వారా పంపించాల‌న్న భావ‌న‌లో సంస్థ ఉంది. బీఎస్ఎన్ఎల్ సంస్థ‌కు ఖ‌రీదైన భూములు ఉన్నాయి. వాటి విలువ 15వేల కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా.

ఈ భూముల‌ను అద్దెకు ఇవ్వ‌డం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే యోచ‌న కూడా చేస్తోంది. మొత్తం మీద ఏకంగా 31వేల కోట్ల న‌ష్టాల్లో కూరుకుపోయిన సంస్థ‌ను గ‌ట్టెక్కించాలంటే ప్రైవేట్ సంస్థ‌ల‌కు ధీటుగా సేవ‌లు అందిస్తేనే సాధ్య‌మ‌వుతుంది.

Tags:    
Advertisement

Similar News