జగన్ హామీలను కాపీ కొట్టినా.... వెనకబడ్డ చంద్రబాబు....
చంద్రబాబు మరో పథకాన్ని జగన్ నుంచి కాపీ కొట్టేశారు. అధికారంలోకి వస్తే రైతు భరోసా పథకం కింద ఏటా ప్రతి రైతుకు 12 వేల 500 రూపాయలు పెట్టుబడి సాయంగా ఇస్తామని ఏడాది క్రితం జగన్ ప్రకటించారు. ఈ పథకాన్ని ఇప్పుడు చంద్రబాబు కాపీ కొట్టారు. ”అన్నదాత సుఖీభవ” పేరుతో అదే పథకాన్ని ప్రకటించారు. ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కింద ఏడాదికి ఒక్కో రైతు కుటుంబానికి 10వేల రూపాయలు ఇవ్వనున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఈ […]
చంద్రబాబు మరో పథకాన్ని జగన్ నుంచి కాపీ కొట్టేశారు. అధికారంలోకి వస్తే రైతు భరోసా పథకం కింద ఏటా ప్రతి రైతుకు 12 వేల 500 రూపాయలు పెట్టుబడి సాయంగా ఇస్తామని ఏడాది క్రితం జగన్ ప్రకటించారు. ఈ పథకాన్ని ఇప్పుడు చంద్రబాబు కాపీ కొట్టారు.
”అన్నదాత సుఖీభవ” పేరుతో అదే పథకాన్ని ప్రకటించారు. ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కింద ఏడాదికి ఒక్కో రైతు కుటుంబానికి 10వేల రూపాయలు ఇవ్వనున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఈ పది వేలు పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వమే ఇవ్వడం లేదు.
పది వేలలో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి రానుంది. ఇటీవల రైతులకు పెట్టుబడి సాయం కేంద్రం ఏటా ఆరు వేలు ఇస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం నుంచి ఆరువేల ఆర్థిక సాయం అందుతుంది. దానికి మరో నాలుగు వేలు కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది.
అది కూడా రెండు విడతల్లో ఇస్తారు. ఇక్కడ మరో విషయం గమనించాల్సింది ఏమిటంటే… కేంద్రం ఇచ్చే డబ్బును కలుపుకున్నా చంద్రబాబు ప్రభుత్వం పదివేలే ఇవ్వనుంది. జగన్ ప్రకటించిన రూ. 12వేల 500 కంటే ఈ మొత్తం తక్కువగానే ఉండడం విశేషం.