ఓటుకు నోటు కేసులో వేం నరేందర్ రెడ్డి సుధీర్ఘ విచారణ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మాజీ టీడీపీ, ప్రస్తుత కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డిని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఆయనను అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ నేతృత్వంలోని బృందం విచారణ చేస్తోంది. ఈ విచారణలో నరేందర్ రెడ్డి కొడుకు కీర్తన్ రెడ్డి కూడా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయడానికి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు ఇవ్వజూపిన 50 లక్షలు ఎక్కడివని నరేందర్ రెడ్డిని […]

Advertisement
Update:2019-02-12 10:33 IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మాజీ టీడీపీ, ప్రస్తుత కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డిని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఆయనను అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ నేతృత్వంలోని బృందం విచారణ చేస్తోంది. ఈ విచారణలో నరేందర్ రెడ్డి కొడుకు కీర్తన్ రెడ్డి కూడా ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయడానికి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు ఇవ్వజూపిన 50 లక్షలు ఎక్కడివని నరేందర్ రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. అంతే కాకుండా ఎన్నిక తర్వాత ఇస్తామన్న 4.5 కోట్ల రూపాయలు ఎక్కడివని అధికారులు అడిగారు. నరేందర్ రెడ్డి బ్యాంకు అకౌంట్లు దగ్గర పెట్టి డబ్బు ఎలా అరేంజ్ చేద్దామనుకున్నారని ప్రశ్నించారు.

మరోవైపు మనీ ల్యాండరింగ్‌కు కూడా పాల్పడి ఉండొచ్చనే అనుమానంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ, ఏసీబీ అధికారుల పిర్యాదు మేరకే ఈ దర్యాప్తును ఈడీ చేపట్టింది. ఇప్పటికే ఈడీ అధికారులు రేవంత్ రెడ్డి, ఉదయ సింహా లను కూడా ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News