సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావుకు ఊహించని పనిష్‌మెంట్ ఇచ్చిన సుప్రీం కోర్టు
సీబీఐ అధికారి అక్రమ బదిలీ కేసులో మాజీ తాత్కాలిక సీబీఐ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావుకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగేశ్వర రావు క్షమాపణ చెప్పినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. నాగేశ్వర రావుకు లక్ష రూపాయల జరిమానా విధించింది. అంతేకాదు కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులోనే ఒక మూల నిల్చోవాలని ఆదేశించింది. తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వరరావు ఉన్న సమయంలో సీబీఐలో ఎలాంటి బదిలీలు చేపట్టవద్దని కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు […]
సీబీఐ అధికారి అక్రమ బదిలీ కేసులో మాజీ తాత్కాలిక సీబీఐ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావుకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
నాగేశ్వర రావు క్షమాపణ చెప్పినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. నాగేశ్వర రావుకు లక్ష రూపాయల జరిమానా విధించింది. అంతేకాదు కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులోనే ఒక మూల నిల్చోవాలని ఆదేశించింది.
తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వరరావు ఉన్న సమయంలో సీబీఐలో ఎలాంటి బదిలీలు చేపట్టవద్దని కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలు పక్కనపెట్టి ముజఫర్‌పూర్ కేసులో దర్యాప్తు అధికారిని… నాగేశ్వరరావు బదిలీ చేశారు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి బదిలీ చేయడం తప్పేనని నాగేశ్వరరావు క్షమాపణ చెప్పినా సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. నాగేశ్వరరావు జరిమానాతో పాటు కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులోనే నిల్చోవాలని ఆదేశించింది.