ఆమెకు ట్విట్టర్ లో వేలలో ఫాలోయర్స్!

ప్రియాంక గాంధీ వాద్రా…..ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలోనూ ఖాతా తెరిచారు. అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను ప్రియాంక గాంధీ ప్రారంభించారు. అయితే ప్రారంభించిన కొన్ని క్షణాల్లోనే వేలమంది ఆమెను ఫాలో అవుతున్నారు. ప్రియాంక గాంధీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను ప్రారంభించినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అకౌంట్ ప్రారంభించిన పదిహేను నిమిషాల్లోనే ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య ఐదువేలు దాటేసింది. Tweets by priyankagandhi […]

Advertisement
Update:2019-02-11 10:25 IST

ప్రియాంక గాంధీ వాద్రా…..ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలోనూ ఖాతా తెరిచారు. అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను ప్రియాంక గాంధీ ప్రారంభించారు. అయితే ప్రారంభించిన కొన్ని క్షణాల్లోనే వేలమంది ఆమెను ఫాలో అవుతున్నారు.

ప్రియాంక గాంధీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను ప్రారంభించినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అకౌంట్ ప్రారంభించిన పదిహేను నిమిషాల్లోనే ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య ఐదువేలు దాటేసింది.

ఇప్పటివరకు ప్రియాంక ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. అయినప్పటికీ ఆమె అకౌంట్ ను వేలలో ఫాలో అవుతున్నారు. అయితే ప్రియాంక మాత్రం చాలా కొద్ది మందిని ఫాలో అవుతున్నారు. తన సోదరుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు, రణ్ దీప్ సుర్జేవాలా, అహ్మాద్ పటేల్, సచిన్ ఫైలెట్, జోతిరాదిత్య సింథియా, అశోక్ గెహ్లాట్ తోపాటు కాంగ్రెస్ పార్టీ కి చెందిన అధికారిక అకౌంట్లను ఆమె ఫాలో అవుతున్నారు.

కాగా ఈ మధ్యే ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన ప్రియాంకా గాంధీ లక్నో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం, జ్యోతిరాధిత్య సింథియా పాల్గొన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రియాంకా గాంధీ…. ఇవాళ తొలిసారిగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ వారం మొత్తం బిజీబిజీగా గడపనున్నారు. ఇక ప్రియాంక రోడ్ షోకు జనం భారీగా హాజరయ్యారు.

Tags:    
Advertisement

Similar News