రాహుల్ పై మండిపడ్డ స్మృతి ఇరానీ!

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మండిపడ్డారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులను గాలికి వదిలేసి….దేశాభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శలు చేశారు. రాహుల్ పనితీరు నచ్చకనే ఆయన సోదరి ప్రియాంక గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడిన స్మృతి ఇరానీ…అమేథీలో రాహుల్ పనితీరు బాగోలేదనే కారణంతో ఇప్పుడు ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు. రాహుల్ తన నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. ఇక దేశానికేం […]

Advertisement
Update:2019-02-10 02:28 IST

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మండిపడ్డారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులను గాలికి వదిలేసి….దేశాభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శలు చేశారు.

రాహుల్ పనితీరు నచ్చకనే ఆయన సోదరి ప్రియాంక గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడిన స్మృతి ఇరానీ…అమేథీలో రాహుల్ పనితీరు బాగోలేదనే కారణంతో ఇప్పుడు ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు. రాహుల్ తన నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. ఇక దేశానికేం చేస్తారంటూ విమర్శించారు.

పార్లమెంట్ లో రాహుల్ చేసిన ప్రసంగాలను వింటుంటే…తన ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నట్లు అనిపించిందన్నారు. దేశ ప్రజల సాధికారత సాధించే విషయంపై ఆయన నోరువిప్పలేదన్నారు. ఇక రాబర్ట్ వాద్రా ఎదుర్కొంటున్న కేసుల గురించి ఆమె స్పందించారు. గాంధీ-నెహ్రు కుటుంబం అవినీతి అజెండా ముందుకు సాగుతుందన్నారు. ఇలాంటి తీరు మరెవరిలోనూ కనిపించదని వ్యాఖ్యనించారు స్మృతి ఇరానీ.

Tags:    
Advertisement

Similar News