మంచులోనే ఏడుగురు పోలీసులు సమాధి !
శ్రీనగర్ -జమ్మూ జాతీయ రహదారికి సమీపంలో ఘోరం జరిగింది. జవహర్ సొరంగ ఉత్తరం ద్వారం దగ్గర పోలీస్ పోస్ట్ పై మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు పోలీసులు మరణించారు. మొత్తం పదిమందిలో ఇద్దరు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసు పోస్టుపై మంచు చరియలు పడిన వెంటనే…. శిథిలాల నుంచి ఇద్దరు పోలీసుల్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు […]
శ్రీనగర్ -జమ్మూ జాతీయ రహదారికి సమీపంలో ఘోరం జరిగింది. జవహర్ సొరంగ ఉత్తరం ద్వారం దగ్గర పోలీస్ పోస్ట్ పై మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు పోలీసులు మరణించారు. మొత్తం పదిమందిలో ఇద్దరు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
పోలీసు పోస్టుపై మంచు చరియలు పడిన వెంటనే…. శిథిలాల నుంచి ఇద్దరు పోలీసుల్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కుల్గాం జిల్లాలో భారీ మంచు తుఫాను చోటు చేసుకుంది. దీంతో పదిమంది పోలీసుల జాడ తెలియకుండా పోయింది. అదే ప్రాంతంలో విధుల్లో ఉన్న మరో పదిమంది పోలీసులు మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. గల్లంతు విషయం తెలుసుకున్న వెంటనే సహాయక బృందాలు చర్యలు చేపట్టారు. కానీ బలమైన గాలులు, మంచు కురుస్తుండంతో సహాయక చర్యలకు తీవ్ర అడ్డంకిగా మారాయి.