భూమనకు టికెట్ లేనట్టే.... బరిలో కొత్త పేర్లు
తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి ఈసారి టికెట్ కష్టమేనని తెలుస్తోంది. తిరుపతి నియోజకవర్గంలో బలిజ సామాజికవర్గం అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఆ సామాజికవర్గం నుంచే అభ్యర్థిని బరిలో దింపాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం సినీ నిర్మాత ఎన్ వి ప్రసాద్ కుంటుంబంతో వైసీపీ చర్చలు జరుపుతోంది. 2004లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఎన్‌వి ప్రసాద్… 2009లో చిరంజీవి గెలుపు కోసం కృషి చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్‌వి ప్రసాద్ కుటుంబానికి నియోజవకర్గంలో భారీగా బంధుగణం […]
తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి ఈసారి టికెట్ కష్టమేనని తెలుస్తోంది. తిరుపతి నియోజకవర్గంలో బలిజ
సామాజికవర్గం అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఆ సామాజికవర్గం నుంచే అభ్యర్థిని బరిలో దింపాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం సినీ నిర్మాత ఎన్ వి ప్రసాద్ కుంటుంబంతో వైసీపీ చర్చలు జరుపుతోంది.
2004లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఎన్‌వి ప్రసాద్… 2009లో చిరంజీవి గెలుపు కోసం కృషి చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్‌వి ప్రసాద్ కుటుంబానికి నియోజవకర్గంలో భారీగా బంధుగణం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్‌వి ప్రసాద్ భార్యకు టికెట్ ఇచ్చేందుకు వైసీపీ ఆఫర్ చేస్తోంది. అయితే ఎన్‌వి ప్రసాద్ కుటుంబం ఎటూ
తేల్చుకోలేక పోతోంది.
ఒకవేళ ఎన్‌వి ప్రసాద్ కుటుంబం నుంచి స్పందన లేని పక్షంలో మాజీ ఎమ్మెల్యే మోహన్‌ను బరిలో దింపాలని యోచిస్తోంది. భూమనకు, తిరుపతి నియోజకవర్గంలో పట్టున్న ఒక సామాజికవర్గానికి తొలి నుంచి కూడా పొసగడం లేదు.
ఈ నేపథ్యంలో భూమనకు ఏదైనా పదవి ఇస్తామన్న హామీతో ఆయన్ను ఎన్నికల బరి నుంచి తప్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో తిరుపతి నుంచి టీడీపీ అభ్యర్థి వెంకటరమణ చేతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఏకంగా 41, 539 ఓట్ల తేడాతో ఓడిపోయారు.