బాబు రాకూడదు... అమిత్ షా ఆదేశం
“ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రాకూడదు. మీరు ఏం చేస్తారు…. ఎలా చేస్తారు…. తెలీదు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదు” ఈ మాటలన్నది భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. అది కూడా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులతో. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో గురువారం అమిత్ షా కీలక సమావేశం ఏర్పాటు చేశారు. […]
“ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రాకూడదు. మీరు ఏం చేస్తారు…. ఎలా చేస్తారు…. తెలీదు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదు” ఈ మాటలన్నది భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. అది కూడా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులతో.
దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో గురువారం అమిత్ షా కీలక సమావేశం ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల అగ్రనేతలతోనూ మాట్లాడిన అమిత్ షా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సీనియర్ నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రానున్న ఎన్నికలలో చంద్రబాబు నాయుడు పరాజయమే లక్ష్యంగా పని చేయాలని తెలుగు రాష్ట్రాల నాయకులను ఆదేశించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా మినహా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు వచ్చాయని, అలాగే కోట్లాది రూపాయల నిధులు కూడా ఇచ్చామని అమిత్ షా బిజెపి తెలుగు రాష్ట్రాల నేతలకు స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం కేంద్రం తనను, రాష్ట్రాన్ని మోసం చేసిందంటూ కపట నాటకాలు వేస్తున్నారని, దీనిని భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించాలని అమిత్ షా దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు.
రానున్న రెండు మూడు నెలలు ఎంతో కీలకమైనవని, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కు చేసిన సాయంపై లెక్కలతో సహా ప్రజలకు వివరించాలని అమిత్ షా సూచించినట్లు సమాచారం. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, చివరకు బూత్ స్థాయిలో కూడా ఈ ప్రచారం జరగాలని అమిత్ షా ఆదేశించినట్లు ఆంధ్రప్రదేశ్ కు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు.