జయరాం హత్య కేసు తెలంగాణకు బదిలీ అయ్యింది : సీపీ అంజన్‌కుమార్
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ యజమాని చిగురుపాటి జయరాం హత్య కేసు తెలంగాణ పోలీసు శాఖకు బదిలీ అయ్యిందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ స్పష్టం చేశారు. గత వారం హైదరాబాద్‌లో హత్య చేసి శవాన్ని కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో కారులో వదిలేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ పోలీసుల ప్రమేయం ఉండటం, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం వంటి కారణాలతో పాటు ఏపీలో జరిగిన విచారణలో…. హత్య జూబ్లీహిల్స్‌లో చేశామని నిందితులు ఒప్పుకున్నారు. దీంతో […]
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ యజమాని చిగురుపాటి జయరాం హత్య కేసు తెలంగాణ పోలీసు శాఖకు బదిలీ అయ్యిందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ స్పష్టం చేశారు. గత వారం హైదరాబాద్‌లో హత్య చేసి శవాన్ని కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో కారులో వదిలేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో తెలంగాణ పోలీసుల ప్రమేయం ఉండటం, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం వంటి కారణాలతో పాటు ఏపీలో జరిగిన విచారణలో…. హత్య జూబ్లీహిల్స్‌లో చేశామని నిందితులు ఒప్పుకున్నారు. దీంతో కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీనిపై అంజనీకుమార్ స్పందిస్తూ…. కృష్ణా జిల్లా ఎస్పీ నుంచి కేసు డైరీ తమకు అందిందని చెప్పారు. జయరామ్ హత్య కేసుకు దర్యాప్తు అధికారిగా బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్‌ను నియమించినట్లు ఆయన ధృవీకరించారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని.. జూబ్లీహిల్స్ స్టేషన్ లో జయరాం భార్య పద్మశ్రీ ఇచ్చిన పిర్యాదును కూడా పరిగణనలోకి తీసుకుంటామని కమిషనర్ చెప్పారు.
ఈ కేసులో ఎటువంటి అనుమానాలకు తావులేకుండా… తెలంగాణ పోలీసులపై పద్మశ్రీ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పారదర్శకంగా కేసు విచారణ సాగుతుందని ఆయన చెప్పారు. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ఇద్దరు నిందితులను విచారిస్తామని అంజనీకుమార్ స్పష్టం చేశారు.