మమతా సర్కార్ కు సుప్రీం షాక్
శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్‌ను విచారించకుండా అడ్డుకుంటున్న మమతా బెనర్జీ సర్కార్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. విచారణకు వెళ్లిన సీబీఐ అధికారులను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో సీబీఐ… సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తక్షణం సీబీఐ ముందు రాజీవ్ కుమార్ లొంగిపోయేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్… సీబీఐ విచారణకు హాజరుకావాల్సిందిగా కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. సీబీఐ పలుమారు నోటీసులు జారీ […]
శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్‌ను విచారించకుండా అడ్డుకుంటున్న మమతా బెనర్జీ సర్కార్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. విచారణకు వెళ్లిన సీబీఐ అధికారులను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో సీబీఐ… సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
తక్షణం సీబీఐ ముందు రాజీవ్ కుమార్ లొంగిపోయేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్… సీబీఐ విచారణకు హాజరుకావాల్సిందిగా కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. సీబీఐ పలుమారు నోటీసులు జారీ చేసినా ఎందుకు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్నారని కమిషనర్‌ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. విచారణ సమయంలో కమిషనర్ సహకరిస్తే ముందస్తు చర్యలు లేకుండా అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది
కోల్‌కతాలో దీక్ష చేస్తున్న మమతా బెనర్జీ సుప్రీం కోర్టు తీర్పుపై వెంటనే స్పందించారు. కోర్టు తీర్పును శిరసావహిస్తామని ప్రకటించారు. సీబీఐ విచారణకు కమిషనర్ సహకరిస్తారని ఆమె ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోకపోవడం వల్లే ఇబ్బందులు వచ్చాయని వ్యాఖ్యానించారు. సీబీఐ దర్యాప్తును తామెన్నడూ అడ్డుకోలేదని చెప్పారామె. సుప్రీం తీర్పు ప్రజా విజయం అని ఆమె వ్యాఖ్యానించారు.