కొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తున్న మోడీ...
కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తిగా దాసోహం అవుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. ప్రాంతం, కులం ఆధారంగా కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు… ముఖ్యమంత్రులకు గులాం చేస్తూ దేశ ప్రయోజనాలను కూడా పక్కన పెడుతున్నారని కేంద్రం భావిస్తోంది. తాజాగా కోల్‌కతాలో సీబీఐ అధికారులను … రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. కోల్‌కతా కమిషనర్ అఖిల భారత సర్వీస్ అధికారి అయి ఉండి కేంద్ర దర్యాప్తు సంస్థకు సహకరించకపోవడాన్ని కేంద్ర […]
కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తిగా దాసోహం అవుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. ప్రాంతం, కులం ఆధారంగా కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు… ముఖ్యమంత్రులకు గులాం చేస్తూ దేశ ప్రయోజనాలను కూడా పక్కన పెడుతున్నారని కేంద్రం భావిస్తోంది.
తాజాగా కోల్‌కతాలో సీబీఐ అధికారులను … రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. కోల్‌కతా కమిషనర్ అఖిల భారత సర్వీస్ అధికారి అయి ఉండి కేంద్ర దర్యాప్తు సంస్థకు సహకరించకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
అటు ఏపీలోనూ సీబీఐని రానివ్వం, ఐటీ అధికారులు వస్తే భద్రత కల్పించబోం అని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. అఖిల భారత సర్వీస్ అధికారుల క్రమశిక్షణ, అప్పీల్ రూల్స్- 1969కు సవరణ చేయనుంది.
ఇప్పటి వరకు ఐఏఎస్, ఐపీఎస్‌లను నియమించేది కేంద్రమే అయినా.. ఒకసారి వారిని రాష్ట్రాలకు కేటాయించిన తర్వాత పోస్టింగ్, బదిలీ, క్రమశిక్షణ చర్యలు అన్ని రాష్ట్ర పరిధిలోనే ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తేనే ఆ తర్వాత కేంద్రం సస్పెన్షన్ వేటు వేయాల్సి ఉండేది. అయితే కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వాలు కాలు దువ్వుతున్న నేపథ్యంలో సర్వీస్ రూల్స్‌కు సవరణ చేయాలని కేంద్రం నిర్ణయించింది.
క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండడం వల్లే ఐఏఎస్, ఐపీఎస్‌లు కేంద్రం మాట వినడం లేదని భావిస్తున్న మోడీ సర్కార్… ఇకపై ఐఏఎస్, ఐపీఎస్‌లపై నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకునే వీలు లేకుండా రూల్స్ సవరణ చేయబోతోంది.
ఇలా చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు సలాం కొడుతూ బతకాల్సిన అవసరం ఐఏఎస్‌లకు, ఐపీఎస్‌లకు ఉండదని పరోక్షంగా చాటబోతోంది. అయితే బెంగాల్, ఏపీ ముఖ్యమంత్రుల వైఖరిని ఆధారంగా చేసుకుని ఏకంగా సర్వీస్ రూల్స్ మార్చేస్తే… ఇకపై ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించే పరిస్థితి ఉండదని… పరోక్షంగా ఈ పరిణామం కేంద్రం చేతిలో గుత్తాధిపత్యానికి దారి తీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.