అర్ధ రాత్రి మమతా ధర్నా....
రాష్ట్రంలో జరిగిన కుంభకోణాల కూపీ లాగేందుకు సీబీఐని అడుగుపెట్టనివ్వడం లేదు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. చంద్రబాబు దారిలోనే ఆమె నడుస్తున్నారు. బెంగాల్‌లో సంచలనం సృష్టించిన, ఎందరి జీవితాలనో తారుమారు చేసిన శారద కుంభకోణంలో సీబీఐ దర్యాప్తుకు బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదు. గతంలో శారదా చిట్ ఫండ్ కుంభకోణంపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌కు ప్రస్తుత కోల్‌కతా కమిషనర్ రాజీవ్ కుమార్ నాయకత్వం వహించారు. కేసును దర్యాప్తుకు తీసుకున్న సీబీఐ కొన్ని కీలక పత్రాలు […]
రాష్ట్రంలో జరిగిన కుంభకోణాల కూపీ లాగేందుకు సీబీఐని అడుగుపెట్టనివ్వడం లేదు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. చంద్రబాబు దారిలోనే ఆమె నడుస్తున్నారు. బెంగాల్‌లో సంచలనం సృష్టించిన, ఎందరి జీవితాలనో తారుమారు చేసిన శారద కుంభకోణంలో సీబీఐ దర్యాప్తుకు బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదు. గతంలో శారదా చిట్ ఫండ్ కుంభకోణంపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌కు ప్రస్తుత కోల్‌కతా కమిషనర్ రాజీవ్ కుమార్ నాయకత్వం వహించారు.
కేసును దర్యాప్తుకు తీసుకున్న సీబీఐ కొన్ని కీలక పత్రాలు గతంలో మాయమైనట్టు గుర్తించింది. అవి రాజీవ్ కుమార్ దర్యాప్తు చేస్తున్న సమయంలోనే పోయినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించేందుకు చాలా రోజులుగా సీబీఐ ప్రయత్నిస్తోంది. తమ ముందు హాజరు కావాల్సిందిగా నోటీసులు కూడా జారీ చేసింది. అయితే సీబీఐ నోటీసులను రాజీవ్ కుమార్ లెక్కచేయలేదు.
ఈ నేపథ్యంలో రాజీవ్‌కుమార్‌ను విచారించేందుకు సీబీఐ బృందం కోల్‌కతా వచ్చింది. రాజీవ్ కుమార్ ఇంటికి దాదాపు 40 మందితో సీబీఐ బృందం వచ్చింది. అయితే వారిని కమిషనర్ ఇంటిలోకి వెళ్లకుండా కోల్‌కతా పోలీసులు అడ్డుకున్నారు. సెర్చ్ వారెంట్ ఏది అంటూ ప్రశ్నించారు. తాము సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా వచ్చామని సీబీఐ చెప్పగా రాష్ట్ర పోలీసులు లెక్కచేయలేదు.
సీబీఐ అధికారులను బలవంతంగా జీపుల్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతటితో ఆగకుండా కోల్‌కతా పోలీసులు నేరుగా సీబీఐ కార్యాలయానికి వెళ్లి అక్కడ కొందరు సీబీఐ అధికారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీబీఐపై రాష్ట్ర పోలీసుల దాడి నేపథ్యంలో కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయం వద్ద కేంద్ర బలగాలు మోహరించాయి.
ఇంతలో బెంగాల్ సీఎం కూడా రంగంలోకి దిగారు. సీబీఐ ద్వారా రాష్ట్రంపై మోడీ ప్రభుత్వం దాడి చేస్తోందంటూ ఆమె అర్థరాత్రి ధర్నాకు దిగారు. బెంగాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర అంటూ ఆరోపించారు. సీఎం ధర్నాతో బీజేపీ కూడా ఎదురుదాడి చేసింది. శారదా కుంభకోణంలో నిజానిజాలు వెలికి తీసేందుకు ప్రయత్నిస్తుంటే మమతా బెనర్జీ ఎందుకు అంతగా ఉలిక్కిపడుతున్నారని బీజేపీ ప్రశ్నించింది.
సీబీఐ అధికారులను రాష్ట్ర పోలీసులతో అరెస్ట్ చేయించడం ద్వారా మమతా … వ్యవస్థలను అవహేళన చేస్తున్నారని బీజేపీ మండిపడింది. సీబీఐపై మమతా బెనర్జీ ఎదురుతిరిగారని తెలియగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్ చేసి అభినందించారు. తాను కూడా ఏపీలో సీబీఐని బ్యాన్ చేసిన విషయాన్ని ఆమెకు వివరించారు.