పవన్ ను పూలతో కొట్టండి..... రాళ్ళ దాడి వద్దు
“పవన్ కళ్యాణ్ తో మనకు వైరం లేదు. మన పట్ల వ్యక్తిగతంగా ఎలాంటి వైరంతోనూ లేరు. ఎవరో చెప్పినట్లు ఆడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆయన వారి మాటలు వినే పరిస్థితి ఉండదు. ఇప్పటి నుంచి మనం పవన్ ని తీవ్రంగా విమర్శించి దూరం చేసుకోవద్దు. భవిష్యత్తులో మనకు ఆయనతో ఎంతో అవసరం ఉంటుంది” ఇవి చంద్రబాబు నాయుడి మాటలు. శాసనసభ ఎన్నికలలో తిరిగి అధికారాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు చంద్రబాబు నాయుడు పగడ్బందీ వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. […]
“పవన్ కళ్యాణ్ తో మనకు వైరం లేదు. మన పట్ల వ్యక్తిగతంగా ఎలాంటి వైరంతోనూ లేరు. ఎవరో చెప్పినట్లు ఆడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆయన వారి మాటలు వినే పరిస్థితి ఉండదు. ఇప్పటి నుంచి మనం పవన్ ని తీవ్రంగా విమర్శించి దూరం చేసుకోవద్దు. భవిష్యత్తులో మనకు ఆయనతో ఎంతో అవసరం ఉంటుంది” ఇవి చంద్రబాబు నాయుడి మాటలు.
శాసనసభ ఎన్నికలలో తిరిగి అధికారాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు చంద్రబాబు నాయుడు పగడ్బందీ వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని రకాల అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతాపార్టీ లే శత్రువులని, మిగిలిన వారందరితోనూ సఖ్యంగానే ఉండాలంటూ… తెలుగు తమ్ముళ్లకు చెబుతున్నారు.
ఇందులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు స్థాయిని పెంచరాదని, పువ్వులతో కొట్టినట్లు గానే ఆయనపై విమర్శలు ఉండాలని చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్లకు చెప్పినట్లు సమాచారం.
భవిష్యత్ అవసరాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ తో వైరం పెంచుకో రాదన్నది చంద్రబాబు నాయుడి ఆలోచనగా చెబుతున్నారు. ఎన్నికల చివర క్షణంలో తనకు సాయం చేయడానికి పవన్ కళ్యాణ్ ముందుకు వస్తారని, ఇందు కోసం ఆయనతో ఎవరి చేత మాట్లాడించాలో తనకు చాలా బాగా తెలుసునని తెలుగు తమ్ముళ్ల వద్ద చంద్రబాబు నాయుడు అన్నట్లుగా చెబుతున్నారు. ఈలోగా ఆవేశపడి పవన్ కళ్యాణ్ పై అనరాని మాటలని ఆయన ఆగ్రహానికి గురికావడం వల్ల పార్టీ నష్టపోతుంది తప్ప విమర్శలు గుప్పించిన వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని గుర్తుంచుకోవాలని చంద్రబాబు చెబుతున్నారు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గట్టెక్కడానికి కారణం పవన్ కల్యాణేనని, ఈ సారి కూడా ఆయనతో సఖ్యంగానే ఉంటూ తిరిగి అధికారంలోకి రావాలన్నది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ ఎట్టి పరిస్దితులలోను జగన్‌తో కలిసి పనిచేయాడానికి సిద్దంగా ఉండరని, దీనిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్‌ను విమర్శించాల్సి వస్తే పువ్వులతో కొట్టినట్లు ఉండాలి తప్ప… రాళ్లదాడిలా ఉండకూడదని తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు నాయుడు సూచించినట్లు చెబుతున్నారు.