సుప్రీంకోర్టును ధిక్కరించి తెల్ తుంబ్డే అరెస్టు

అరెస్టు చేయడానికి ముందే జామీను తెచ్చుకోవడానికి సుప్రీంకోర్టు నాలుగు వారాల గడువిచ్చినా దానిని లెక్క చేయకుండా పుణే పోలీసులు ప్రసిద్ధ పండితుడు ఆనంద్ తెల్ తుంబ్డే ను శనివారం తెల్లవారు ఝామున మూడున్నరకు అరెస్టు చేశారు. ముంబై విమానాశ్రయంలో ఇన్ స్పెక్టర్ ఇందుల్కర్ నాయకత్వంలోని పోలీసుల బృందం ఆయనను అరెస్టు చేసిందని తెల్ తుంబ్డే సహచరులు చెప్పారు. ఆనంద్ తెల్ తుంబ్డే ప్రముఖ పౌరహక్కుల నాయకుడు కూడా. “పట్టణ నక్సలైట్” గా ముద్ర పడిన తెల్ తుంబ్డేపై దాఖలైన […]

Advertisement
Update:2019-02-02 06:46 IST

అరెస్టు చేయడానికి ముందే జామీను తెచ్చుకోవడానికి సుప్రీంకోర్టు నాలుగు వారాల గడువిచ్చినా దానిని లెక్క చేయకుండా పుణే పోలీసులు ప్రసిద్ధ పండితుడు ఆనంద్ తెల్ తుంబ్డే ను శనివారం తెల్లవారు ఝామున మూడున్నరకు అరెస్టు చేశారు. ముంబై విమానాశ్రయంలో ఇన్ స్పెక్టర్ ఇందుల్కర్ నాయకత్వంలోని పోలీసుల బృందం ఆయనను అరెస్టు చేసిందని తెల్ తుంబ్డే సహచరులు చెప్పారు.

ఆనంద్ తెల్ తుంబ్డే ప్రముఖ పౌరహక్కుల నాయకుడు కూడా. “పట్టణ నక్సలైట్” గా ముద్ర పడిన తెల్ తుంబ్డేపై దాఖలైన ప్రాథమిక సమాచార నివేదికను రద్దు చేయడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు జనవరి 14వ తేదీన ముందస్తు జామీను తెచ్చుకోవడానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది.

ముందస్తు జామీను తెచ్చుకోవడానికి అనుమతించడానికి పుణే కోర్టు అంగీకరించనందువల్లే తాము తెల్ తుంబ్డేను అరెస్టు చేశామని పోలీసులు అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేయడానికి కుట్ర పన్నారని, గత ఏడాది జనవరి ఒకటవ తేదీన భీమా కోరే గావ్ లో దళితులను రెచ్చగొట్టారన్న ఆరోపణపై మరో తొమ్మిది మంది పౌర హక్కుల కార్యకర్తలను జైలులో ఉంచారు.

ఈ ఆరోపణలు తన మీద కూడా వచ్చినందువల్ల తనకు మనశ్శాంతి లేకుండా పోయిందని, తన మీద మోపిన ఆరోపణలు ఒక వేపు ఆశ్చర్యం మరో వేపు భయం కలిగించాయని గత నెలలో “ది వైర్” తో మాట్లాడుతూ తెల్ తుంబ్డే చెప్పారు.

“మొదటి రోజు నుంచి పోలీసులు కట్టుకథలు ప్రచారం చేస్తున్నారు. ఈ వాదనల్లో లేశమంత కూడా నిజం లేదు. అవి ఎన్నటికీ రుజువు కావు” అని కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడే తెల్ తుంబ్డే అన్నారు. ప్రాథమిక దర్యాప్తు నివేదికలో పేర్కొన్న 14 మంది మీద ఆరోపణలు రుజువు చేసే ఉద్దేశం పోలీసులకు లేదని, కేవలం తనను వేధించడానికే ఈ ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసులు మా మీద చర్య తీసుకున్నారు. మా ఇళ్లల్లో సోదాలు చేశారు. దేశవ్యాప్తంగా భయోత్పాతం సృష్టించారు అని తెల్ తుంబ్డే పేర్కొన్నారు.

నిందితుల మీద ఆరోపణలను పోలీసులు గత ఏడాది కాలంగా రుజువు చేయలేక పోయారన్నది వాస్తవం. అయితే మొదట అరెస్టు చేసిన అయిదుగురిపై పోలీసులు నమోదు చేసిన చార్జి షీట్ 500 పేజీలు ఉంది. న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, దళిత హక్కుల కోసం పోరాడే సుధీర్ ధవాలే, జైలులో ఉన్నా హక్కుల కోసం పోరాడే రోనా విల్సన్, గిరిజన హక్కుల కోసం పాటు పడే మహేశ్ రౌత్, పదవీ విరమణ చేసిన సోమా సేన్ పై ఈ చార్జి షీట్ దాఖలైంది.

Tags:    
Advertisement

Similar News