మోడీ హయాంలో సాధించిన ప్రగతి ఇదీ " బడ్జెట్‌లో వివరించిన గోయల్‌

లోక్‌సభలో ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను మంత్రి పీయూష్ గోయల్‌ ప్రవేశపెట్టారు. నాలుగున్నరేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అంశాలను వివరించారు. ప్రస్తుత బడ్జెట్‌లోని అంశాలను వెల్లడించారు. నాలుగున్నరేళ్లలో ఏం చేశారో గోయల్ చెప్పిన విషయాలు… 1. మోదీ సారథ్యంలో సుస్థిర పాలన అందించాం. దేశంలో సుస్ధిరతను సాధించాం. 2. రైతుల ఆదాయం రెట్టింపు అయింది. 3. ఆర్థిక అభివృద్ధిలో ప్రపంచంలోనే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 4. ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించింది. 5. 2018-19లో […]

Advertisement
Update:2019-02-01 06:09 IST

లోక్‌సభలో ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను మంత్రి పీయూష్ గోయల్‌ ప్రవేశపెట్టారు. నాలుగున్నరేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అంశాలను వివరించారు. ప్రస్తుత బడ్జెట్‌లోని అంశాలను వెల్లడించారు. నాలుగున్నరేళ్లలో ఏం చేశారో గోయల్ చెప్పిన విషయాలు…

1. మోదీ సారథ్యంలో సుస్థిర పాలన అందించాం. దేశంలో సుస్ధిరతను సాధించాం.
2. రైతుల ఆదాయం రెట్టింపు అయింది.
3. ఆర్థిక అభివృద్ధిలో ప్రపంచంలోనే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది.
4. ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించింది.
5. 2018-19లో ద్రవ్యలోటు అంచనా 3.4 శాతం.
6. కరెంట్ అకౌంట్‌ లోటును 5.6 నుంచి 2.5 శాతానికి తగ్గించాం.
7. అందరికీ ఇల్లు, మరుగుదొడ్లు, విద్యుత్ అందిస్తున్నాం.
8. మా ప్రభుత్వంలో పెరుగుతున్న ధరల నడ్డి విరిచాం.
9. నాలుగున్నరేళ్లలో రెండంకెల్లో ఉన్న ద్రవ్యోల్బణాన్ని నేలకు దిగివచ్చేలా చేశాం.
10. నాలుగున్నరేళ్లలో 239 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చాం.
11. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులను గణనీయంగా తగ్గించగలిగాం.
12. బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం.
13.బ్యాంకింగ్‌ రంగంలో పారదర్శకతకు పెద్దపీట వేశాం.
14. దివాళా చట్టం ద్వారా అక్రమాలను అరికట్టాం.
15. ఆర్థిక వృద్ధి రేటులో 11వ స్థానంలో ఉన్న దేశాన్ని నేడు ఆరో స్థానానికి తీసుకొచ్చాం.
16. మాది అవినీతి రహిత ప్రభుత్వం. రేరా చట్టం ద్వారా బినామీ లావాదేవీలను నిరోధించాం.
17. 2022లోగానే నవ భారతాన్ని చూడబోతున్నాం.
18.స్వచ్చ భారత్‌ ద్వారా విశేషమైన ప్రగతి సాధించాం.
19.అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాం.
20. ఉపాధి హామీ పథకానికి భారీగా నిధులు పెంచాం.
21. 15లక్షల 20వేల గ్రామాలకు పక్కా రహదారుల సౌకర్యం కల్పించాం.
22. పట్టణాలకు ధీటుగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.
23. ప్రధాన మంత్రి సడక్ యోజన కింద రూ. 19వేల కోట్లు కేటాయించాం.
24. 2014 కు ముందు బస్సు సౌకర్యం లేని గ్రామాలకు ఇవాళా బస్సు సౌకర్యం తీసుకొచ్చాం.
25. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం ఆయుష్మాన్‌ భారత్‌ను తీసుకొచ్చాం.
26. ఆయుష్మాన్ భారత్‌ ద్వారా 50 కోట్ల మంది పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం.

Tags:    
Advertisement

Similar News