బెంగుళూరులో కూలిన ఫైటర్ జెట్.... ఇద్దరు పైలెట్లు మృతి

బెంగళూరులోని హిందుస్థాన్ ఏరొనాటికల్ లిమిటెడ్ రన్‌‌వేకు సమీపంలో ఇవాళ ఉదయం మిరాజ్ 2000 ఫైటర్ జెట్ కూలిపోయింది. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు అందులోని పైలట్లు ఎజక్టర్ ద్వారా బయటకు వచ్చినా తీవ్ర గాయాలతో వారు మృతి చెందారు. భారత వైమానిక దళానికి చెందిన స్క్వాడ్రన్ లీడర్లు సమీర్ అబ్రోల్, సిద్దార్థ్ నేగి ఈ విమానాన్ని ఉదయం 10.30 గంటలప్పుడు టేకాఫ్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో రన్‌వే పై కూలిపోయిందని.. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని రక్షణ […]

Advertisement
Update:2019-02-01 09:13 IST

బెంగళూరులోని హిందుస్థాన్ ఏరొనాటికల్ లిమిటెడ్ రన్‌‌వేకు సమీపంలో ఇవాళ ఉదయం మిరాజ్ 2000 ఫైటర్ జెట్ కూలిపోయింది. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు అందులోని పైలట్లు ఎజక్టర్ ద్వారా బయటకు వచ్చినా తీవ్ర గాయాలతో వారు మృతి చెందారు.

భారత వైమానిక దళానికి చెందిన స్క్వాడ్రన్ లీడర్లు సమీర్ అబ్రోల్, సిద్దార్థ్ నేగి ఈ విమానాన్ని ఉదయం 10.30 గంటలప్పుడు టేకాఫ్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో రన్‌వే పై కూలిపోయిందని.. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.

ఈ మిరాజ్ 2000 విమానం ‘జీరో జీరో’ సాంకేతికత కలిగిన ఎజెక్షన్ సీట్లు కలిగి ఉంది. విమానం నేలపై ఉన్న సమయంలో కూడా ఈ సీట్లు పని చేస్తాయి. అయితే ఎజెక్షన్ సీట్ల నుంచి బయటకు వచ్చినా వారు ఎందుకు తీవ్ర గాయాల పాలయ్యారనే విషయం ఇంకా తెలియరాలేదు.

1985లో భారత వైమానిక దళంలోనికి ప్రవేశించిన ఈ మిరాజ్ 2000 విమానాలు ఫ్రాన్స్‌లో తయారు చేయబడ్డాయి. ప్రస్తుతం 50 మిరాజ్ విమానాలు సేవలు అందిస్తున్నాయి. వీటి పూర్తి బాధ్యత హెచ్ఏఎల్ చూస్తుంది.

ప్రస్తుతం కొన్ని మిరాజ్ విమానాలను అప్ గ్రేడ్ చేస్తున్నారు. అలా అప్‌గ్రేడ్ చేయబడిన ఒక విమానాన్ని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో పరీక్షించడానికి తీసుకెళ్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

Tags:    
Advertisement

Similar News