ప్రియాంక వచ్చారు... కింకర్తవ్యం?
ప్రియాంక గాంధీ నేరుగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇప్పటి వరకు అన్న రాహుల్ గాంధీకి సలహాలు, సూచనలు చేసిన ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు. ఆమెకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. దేశంలో ఎంతో కీలకమైన ఉత్తర ప్రదేశ్ పార్టీ బాధ్యతలను రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీకి అప్పగించారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఉత్తరప్రదేశ్ లో గెలిచిన స్థానాలే కీలకం. రానున్న ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు పలు పథకాలతో […]
ప్రియాంక గాంధీ నేరుగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇప్పటి వరకు అన్న రాహుల్ గాంధీకి సలహాలు, సూచనలు చేసిన ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు. ఆమెకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. దేశంలో ఎంతో కీలకమైన ఉత్తర ప్రదేశ్ పార్టీ బాధ్యతలను రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీకి అప్పగించారు.
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఉత్తరప్రదేశ్ లో గెలిచిన స్థానాలే కీలకం. రానున్న ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు పలు పథకాలతో ఎన్నికల బరిలోకి వస్తున్న భారతీయ జనతా పార్టీకి ప్రియాంక గాంధీ రూపంలో చెక్ పెట్టాలని రాహుల్ గాంధీ తన సోదరిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు.
ప్రియాంక గాంధీ కారణంగా భారతీయ జనతా పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయి అని పార్టీ అధిష్టానం అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో ప్రియాంక ప్రభావం ఎంతవరకు ఉంటుందో అంచనా వేసేందుకు అక్కడి నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తోంది.
ఈ సమావేశం అనంతరం ఉత్తరప్రదేశ్ లో ఎలాంటి వ్యూహరచన చేయాలి అన్నది నిర్ణయిస్తారని తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు తెలిపారు.
రానున్న ఎన్నికలలో తమకు ఇబ్బందులు ఎదురు కావని జనతా పార్టీ అధిష్టానం పైకి చెబుతున్నా ప్రియాంక రూపంలో మాత్రం ఇక్కట్లు తప్పవేమో అన్నా భయం వెంటాడుతోంది. ప్రియాంక గాంధీ ఇచ్చే పోటీ నుంచి ఏ విధంగా బయటపడాలి, ఇక ముందు కింకర్తవ్యమని కమలనాథులు తలలు పట్టుకుంటున్నారు.
వివిధ సర్వేల్లో కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయని చెబుతున్న సమయంలో ప్రియాంక గాంధీని ఎదుర్కొనేందుకు పగడ్బందీ వ్యూహ రచన చేయాలన్నది భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుల ఆలోచనగా చెబుతున్నారు.