వామపక్షాలకు 40.... పవన్ ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేయాలని జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ మీడియా ముందు కూడా ప్రకటించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులతో కలిసి పలు కార్యక్రమాలు చేపట్టారు పవన్. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసేది లేదని తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ల మధ్య ఎన్నికల పొత్తు ఉంటుందని […]
ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేయాలని జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ మీడియా ముందు కూడా ప్రకటించారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులతో కలిసి పలు కార్యక్రమాలు చేపట్టారు పవన్. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసేది లేదని తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ల మధ్య ఎన్నికల పొత్తు ఉంటుందని టిడిపి నేత టీ.జీ.వెంకటేష్ చేసిన ప్రకటనపై పవన్ మండిపడ్డారు.
ఆ సందర్భంలోనే తాము వామపక్షాలతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన సీనియర్ నాయకులతో పవన్ కళ్యాణ్ మంతనాలు జరిపినట్లు సమాచారం.
రానున్న ఎన్నికల్లో 40 శాసనసభ స్థానాలను వామపక్షాలకు కేటాయించాలని పవన్ కళ్యాణ్ ఆ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వామపక్షాలు ఎక్కడ బలంగా ఉన్నాయో అంచనా వేసి జాబితా రూపొందించాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లు చెబుతున్నారు.
రాయలసీమలోని రెండు జిల్లాలు, విజయవాడ నగరం, విశాఖపట్నం లోని ఏజెన్సీ ప్రాంతంలో వామపక్షాలు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లు చెబుతున్నారు.
అభ్యర్థులను ముందుగా ఎంపిక చేసుకుని ఆ జాబితాను తనకు ఇస్తే వీలున్నంత త్వరగా తాను ప్రచార బరిలో దిగుతానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో 40 స్థానాలు వామపక్షాలకు కేటాయిస్తే మిగిలిన 135 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ పేర్కొంటున్నారు.
ఇప్పటి నుంచే ప్రచారాన్ని, వ్యూహాలను రూపొందిస్తే విజయం సాధించడం సాధ్యమని పవన్ కళ్యాణ్ వామపక్షాల నాయకులతో అన్నట్లు సమాచారం. అలాగే లోక్‌సభ అభ్యర్ధుల ఎంపికపై కూడా ముందుగానే నిర్ణయం తీసుకుంటే మంచిదనే ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు.