వైఎస్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు
ఎప్పుడు కలిసినా ప్రధాని మోడీ తనపై ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాల్సిందిగా ఒత్తిడి తెస్తుంటారని కేసీఆర్ చెప్పారు. ఆ సమయంలో తామిద్దరి మధ్య వాదన జరిగిందన్నారు. కానీ ఆయుష్మాన్ భారత్ పథకంలో తెలంగాణను చేర్చేందుకు అంగీకరించడం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకం కంటే అద్భుతంగా ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉనప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చారని…. అది చాలా గొప్ప పథకమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దాన్ని అభినంధించడంలో ఎలాంటి బేషజాలు […]
ఎప్పుడు కలిసినా ప్రధాని మోడీ తనపై ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాల్సిందిగా ఒత్తిడి తెస్తుంటారని కేసీఆర్ చెప్పారు. ఆ సమయంలో తామిద్దరి మధ్య వాదన జరిగిందన్నారు. కానీ ఆయుష్మాన్ భారత్ పథకంలో తెలంగాణను చేర్చేందుకు అంగీకరించడం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకం కంటే అద్భుతంగా ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉనప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చారని…. అది చాలా గొప్ప పథకమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దాన్ని అభినంధించడంలో ఎలాంటి బేషజాలు తమకు లేవన్నారు. వైఎస్ మంచి ఆలోచన చేశారన్నారు.
మోడీ తెచ్చిన పథకం కంటే వైఎస్ తెచ్చిన ఆరోగ్య శ్రీ పథకం అద్బుతంగా ఉందన్నారు. గొప్ప పనులు చేసిన వారికి చరిత్రలో కీర్తి ఉంటుందని… దాన్ని ఎవరూ తుడిపేయలేరన్నారు.
వైఎస్ తెచ్చిన పథకాన్నే తాము ముందుకు తీసుకెళ్తామని మోడీకి స్పష్టంగా చెప్పి వచ్చానన్నారు కేసీఆర్. వైఎస్ తెచ్చిన 108 అంబులెన్స్ లను కూడా తాము నడుపుతున్నామని వివరించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మాన చర్చ సందర్భంగా అసెంబ్లీలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.