జైట్లీకి క్యాన్సర్‌... ఆపరేషన్‌ కష్టమంటున్న వైద్యులు

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ క్యాన్సర్ బారినపడ్డారు. దీంతో ఆయన వైద్యం కోసం అమెరికా వెళ్లారు. తొడ భాగంలో క్యాన్సర్ కణితి బయటపడింది. రెండువారాల పాటు వ్యక్తిగత సెలవుపై ఆయన న్యూయార్క్ వెళ్లారు. అరుణ్ జైట్లీకి 66 ఏళ్లు. ఇటీవలే కిడ్నీలకు చికిత్స జరిగింది. ఈనేపథ్యంలో క్యాన్సర్ చికిత్సను అరుణ్‌ జైట్లీ తట్టుకోగలరా అన్న అనుమానాన్ని వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆపరేషన్ చేయకపోయినా ఇబ్బందేనని చెబుతున్నారు. ఆపరేషన్ చేయకపోతే కణజాల క్యాన్సర్‌ శరీరంలోని ఇతర […]

Advertisement
Update:2019-01-17 03:02 IST

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ క్యాన్సర్ బారినపడ్డారు. దీంతో ఆయన వైద్యం కోసం అమెరికా వెళ్లారు. తొడ భాగంలో క్యాన్సర్ కణితి బయటపడింది.

రెండువారాల పాటు వ్యక్తిగత సెలవుపై ఆయన న్యూయార్క్ వెళ్లారు. అరుణ్ జైట్లీకి 66 ఏళ్లు. ఇటీవలే కిడ్నీలకు చికిత్స జరిగింది. ఈనేపథ్యంలో క్యాన్సర్ చికిత్సను అరుణ్‌ జైట్లీ తట్టుకోగలరా అన్న అనుమానాన్ని వైద్యులు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఆపరేషన్ చేయకపోయినా ఇబ్బందేనని చెబుతున్నారు. ఆపరేషన్ చేయకపోతే కణజాల క్యాన్సర్‌ శరీరంలోని ఇతర భాగాలకు పాకే అవకాశం ఉందంటున్నారు. జైట్లీ త్వరగా కోలుకోవాలని పలువురు నేతలు ఆకాంక్షించారు.

Tags:    
Advertisement

Similar News