హార్ధిక్ పాండ్యాపై మరో వేటు... మహిళా సభ్యుల ఒత్తిడితో...
మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి బీసీసీఐ ఆగ్రహానికి గురైన క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. ముంబైలోని ప్రతిష్టాత్మక ”ఖర్ జింఖానా” క్లబ్ నుంచి పాండ్యాను తొలగించారు. పాండ్యా సభ్యత్వం రద్దు చేస్తున్నట్టు క్లబ్ ప్రకటించింది. గత అక్టోబర్‌లో ఇక్కడ పాండ్యా సభ్యత్వం పొందారు. పాండ్యా వ్యాఖ్యల నేపథ్యంలో కమిటి భేటీ జరిగింది. ఈ భేటీలో మహిళా సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన హార్దిక్‌పై చర్యలు […]
మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి బీసీసీఐ ఆగ్రహానికి గురైన క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. ముంబైలోని ప్రతిష్టాత్మక ”ఖర్ జింఖానా” క్లబ్ నుంచి పాండ్యాను తొలగించారు. పాండ్యా సభ్యత్వం రద్దు చేస్తున్నట్టు క్లబ్ ప్రకటించింది.
గత అక్టోబర్‌లో ఇక్కడ పాండ్యా సభ్యత్వం పొందారు. పాండ్యా వ్యాఖ్యల నేపథ్యంలో కమిటి భేటీ జరిగింది. ఈ భేటీలో మహిళా సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన హార్దిక్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పాండ్యా సభ్యత్వాన్ని మూడేళ్ల పాటు రద్దు చేసినట్టు క్లబ్ సెక్రటరీ గౌరవ్ కపాడియా వెల్లడించారు.
ప్రతిష్టాత్మకమైన ఈ క్లబ్ గౌరవ పూర్వకంగా ప్రముఖ క్రీడాకారులకు సభ్యత్వం కల్పించింది. అందులో సచిన్ టెండుల్కర్, మహేష్ భూపతి, సానియా మీర్జా, సైనా నెహ్వాల్ లాంటి వారు ఉన్నారు.
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో పాల్గొన్న పాండ్యా ‘‘అమ్మాయిల విషయంలో నేనేమీ బుద్ధిమంతుడ్ని కాదు. వాళ్లను అదో టైపుగా చూస్తా. క్లబ్‌లలో వారి ఒంపుసొంపులపై కైపుగా కన్నేస్తా. ఎవరైనా అమ్మాయిని శారీరకంగా కలిస్తే…. నేను ఈ రోజు …ఆ పని చేసొచ్చా అని తల్లిదండ్రులతో చెప్పేస్తా’ అని వ్యాఖ్యానించాడు.