చేజింగ్ లో సెంచరీల కింగ్ విరాట్ కొహ్లీ

కూల్ కూల్ ధోనీకి కొహ్లీ హ్యాట్సాఫ్ భువనేశ్వర్ కుమార్ పైనా ప్రశంసల వర్షం… వన్డే క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. చేజింగ్ లో సెంచరీల కింగ్ గా నిలిచాడు. అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో వన్డేలో విరాట్ కొహ్లీ …మాస్టర్ క్లాస్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు. బ్యాటింగ్ కు అంతగా అనువుకాని అడిలైడ్ ఓవల్ వికెట్ పై కొహ్లీ 112 బాల్స్ […]

Advertisement
Update:2019-01-16 12:00 IST
  • కూల్ కూల్ ధోనీకి కొహ్లీ హ్యాట్సాఫ్
  • భువనేశ్వర్ కుమార్ పైనా ప్రశంసల వర్షం…

వన్డే క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. చేజింగ్ లో సెంచరీల కింగ్ గా నిలిచాడు.

అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో వన్డేలో విరాట్ కొహ్లీ …మాస్టర్ క్లాస్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు.

బ్యాటింగ్ కు అంతగా అనువుకాని అడిలైడ్ ఓవల్ వికెట్ పై కొహ్లీ 112 బాల్స్ లో 2 సిక్సర్లు, 5 బౌండ్రీలతో 104 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

చేజింగ్ లో 21వ శతకం….

ప్రస్తుత సిరీస్ లోని రెండో వన్డే వరకూ…తన కెరియర్ లో 218 మ్యాచ్ లు ఆడిన కొహ్లీ…210 ఇన్నింగ్స్ లో 39 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు సాధించాడు. మొత్తం 10వేల 339 పరుగులతో 59.76 సగటు నమోదు చేశాడు.

అంతేకాదు…చేజింగ్ లో అత్యధికంగా 21 శతకాలు బాదిన తొలి క్రికెటర్ గా విరాట్ కొహ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మాస్టర్ సచిన్ టెండుల్కర్ కు చేజింగ్ సమయంలో 14 శతకాలు మాత్రమే ఉన్నాయి.

ధోనీకి హ్యాట్సాఫ్….

టీమిండియా కూల్ కూల్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ పై…కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు.

అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన కీలక రెండోవన్డేలో నెగ్గి తీరాల్సిన టీమిండియాకు…ఫైటింగ్ హాఫ్ సెంచరీతో ధోనీ విజయం ఖాయం చేయడంతో… కొహ్లీ పొంగిపోయాడు.

తాను శతకం సాధించినా…ధోనీ మ్యాచ్ ను ఫినిష్ చేసిన తీరు అద్భుతమంటూ ఆకాశానికి ఎత్తేశాడు. మ్యాచ్ ను ఏవిధంగా ముగించాలో…ధోనీకి తెలిసినట్లుగా మరెవ్వరికీ తెలియదని తెలిపాడు.

ఓపెనింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సైతం…గొప్పగా రాణించి…విజయానికి మార్గం సుగమం చేశాడని చెప్పాడు. తన కెరియర్ లో 39వ వన్డే సెంచరీ సాధించడం ద్వారా కొహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు.

ధోనీ 69వ హాఫ్ సెంచరీ….

టీమిండియా ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ..2017 సీజన్ తర్వాత…వన్డేల్లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు సాధించాడు.

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన తొలివన్డేలో …96 బాల్స్ హాఫ్ సెంచరీ సాధించిన ధోనీ.. అడిలైడ్ ఓవల్ వేదికగా ముగిసిన రెండో వన్డేలో ఏకంగా మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. దినేశ్ కార్తీక్ తో కలసి 5వ వికెట్ కు అజేయ హాఫ్ సెంచరీతో నిలిచాడు.

37 ఏళ్ల వయసులో ….

ధోనీ 54 బాల్స్ లో రెండు సిక్సర్లతో 55 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు. వన్డే కెరియర్ లో 334వ మ్యాచ్ ఆడిన ధోనీ 283 వ ఇన్నింగ్స్ లో 69వ హాఫ్ సెంచరీ నమోదు చేయటం విశేషం.

2017 సీజన్లో ధర్మశాల వేదికగా శ్రీలంకపై తన చివరి హాఫ్ సెంచరీ సాధించిన ధోనీ…మరో అర్థశతకం కోసం 2019 సీజన్ వరకూ వేచిచూడాల్సి వచ్చింది.

 

Tags:    
Advertisement

Similar News