కమిషనర్ ను కలిసిన వైఎస్ షర్మిల.... వారిపై ఫిర్యాదు
వైఎస్ షర్మిల హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ను కలిశారు. పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఆమె కమిషనర్ అంజనీ కుమార్‌ను కలిశారు. కొంత కాలంగా సోషల్ మీడియాలో తన పట్ల, తన కుటుంబసభ్యుల పట్ల కొన్ని పార్టీల అభిమానులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, పోస్టులపై ఆమె ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఆధారాలను కూడా సమర్పించారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. షర్మిలతో పాటు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితరులు సీపీని […]
వైఎస్ షర్మిల హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ను కలిశారు. పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఆమె కమిషనర్ అంజనీ కుమార్‌ను కలిశారు. కొంత కాలంగా సోషల్ మీడియాలో తన పట్ల, తన కుటుంబసభ్యుల పట్ల కొన్ని పార్టీల అభిమానులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, పోస్టులపై ఆమె ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఆధారాలను కూడా సమర్పించారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
షర్మిలతో పాటు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితరులు సీపీని కలిశారు. నిజానికి వైఎస్ జగన్‌ను, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేయాలనుకున్న ప్రతిసారి ప్రత్యర్ధి పార్టీ వారు షర్మిలపై అనుచిత పోస్టులు పెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ వ్యతిరేక ప్రభుత్వం ఉండడంతో వారి చర్యలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. 2014 ఎన్నికల సమయంలోనూ వైఎస్ కుటుంబాన్ని బదనాం చేయడానికి కొందరు అనుచిత పోస్టులు పెట్టి అరెస్ట్ కూడా అయ్యారు.