ఆర్మీపై అమ్మాయిల వల
భారత ఆర్మీలోని కొందరు జవాన్లు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆర్మీ సోమ్‌వీర్ అనే సైనికుడిని అరెస్ట్ చేశారు. ఆర్మీలో దాదాపు 50 మంది జవాన్లు ఈ హనీ ట్రాప్‌లో పడ్డట్టు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆర్మీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని జైసల్మేరులో జవాన్‌గా పనిచేస్తున్న సోమ్‌వీర్‌కు కొన్ని నెలల క్రితం నుంచి ఒక మహిళ ఫేస్‌బుక్‌లో టచ్‌లో ఉంటోంది. వారిద్దరూ నిత్యం చాట్ చేసుకుంటున్నారు. అనికా చోప్రా పేరుతో అవతలి మహిళ చాట్ […]
భారత ఆర్మీలోని కొందరు జవాన్లు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆర్మీ సోమ్‌వీర్ అనే సైనికుడిని అరెస్ట్ చేశారు. ఆర్మీలో దాదాపు 50 మంది జవాన్లు ఈ హనీ ట్రాప్‌లో పడ్డట్టు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆర్మీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని జైసల్మేరులో జవాన్‌గా పనిచేస్తున్న సోమ్‌వీర్‌కు కొన్ని నెలల క్రితం నుంచి ఒక మహిళ ఫేస్‌బుక్‌లో టచ్‌లో ఉంటోంది. వారిద్దరూ నిత్యం చాట్ చేసుకుంటున్నారు.
అనికా చోప్రా పేరుతో అవతలి మహిళ చాట్ చేస్తోంది. ఆమె వలలో సోమ్‌వీర్ ఎంతగా పడ్డాడంటే… ఈమె కోసం ఓ దశలో భార్యకు విడాకులు ఇచ్చేందుకు కూడా సిద్ధపడ్డాడు. మిలటరీ ఆర్మీ క్యాంటీన్‌లో తాను కెప్టెన్‌గా పనిచేస్తున్నానని తొలుత ఆమె పరిచయం చేసుకుంది. ఆ తర్వాత సోమ్‌వీర్‌తో హద్దులు దాటి వలపుల వల వేసింది.
అలా చాట్ చేస్తూ ఆర్మీకి సంబంధించిన పలు వివరాలను సోమ్‌వీర్ నుంచి సేకరించింది. ఆ తర్వాత ఆ వివరాల ఆధారంగానే అతడిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది. చెప్పినట్టు వినకపోతే ఆర్మీ వివరాలు లీక్ చేసిన అంశాన్ని బయటపెడుతానని బెదిరించింది. దాంతో అప్పటి నుంచి సోమ్ వీర్ ఆమె చెప్పినట్టు వింటున్నాడు. అడిగిన సమాచారం ఆమెకు ఇస్తున్నాడు. అందుకు ప్రతిఫలంగా అటువైపు నుంచి డబ్బు అందుతోంది.
అయితే సోమ్‌వీర్‌కు పదేపదే కశ్మీర్ ప్రాంతం నుంచి ఫోన్లు రావడం గుర్తించిన ఆర్మీ సిబ్బంది అతడి ఎఫ్‌బీ ఖాతాను తనిఖీ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. అనికా చోప్రా పేరుతో చాటింగ్ చేసిన మహిళ పాకిస్తాన్ నుంచి ఎఫ్‌బీ అకౌంట్‌ను ఆపరేట్ చేసినట్టు ఆర్మీ గుర్తించింది. ఈ హనీ ట్రాప్‌లో 50 మంది వరకు ఉన్నట్టు ఆర్మీ గుర్తించి… వారిని విచారిస్తోంది. ఎలాంటి సమాచారం సరిహద్దులు దాటింది అన్న దానిపై ఆరా తీస్తున్నారు.