వన్డే సిరీస్ లో టీమిండియాకు డూ ఆర్ డై
సంక్రాంతి రోజునే అభిమానులకు వన్డే పండుగ అడిలైడ్ ఓవల్ వేదికగా రెండో వన్డే టీమిండియా నెగ్గితేనే సిరీస్ ఆశలు సజీవం… టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల తీన్మార్ వన్డే సిరీస్ షో….సిడ్నీ నుంచి అడిలైడ్ ఓవల్ కు చేరింది. సంక్రాంతి రోజునే జరిగే ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో….రెండుజట్లూ…పందెం కోళ్ల తరహాలో ఢీ కొనబోతున్నాయి. కంగారూ నయాజోష్…. తొలివన్డేలో నెగ్గిన జోష్ తో ఆతిథ్య కంగారూ టీమ్ సిరీస్ కు గురిపెడితే…తొలి ఓటమితో కంగుతిన్న టీమిండియా […]
- సంక్రాంతి రోజునే అభిమానులకు వన్డే పండుగ
- అడిలైడ్ ఓవల్ వేదికగా రెండో వన్డే
- టీమిండియా నెగ్గితేనే సిరీస్ ఆశలు సజీవం…
టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల తీన్మార్ వన్డే సిరీస్ షో….సిడ్నీ నుంచి అడిలైడ్ ఓవల్ కు చేరింది. సంక్రాంతి రోజునే జరిగే ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో….రెండుజట్లూ…పందెం కోళ్ల తరహాలో ఢీ కొనబోతున్నాయి.
కంగారూ నయాజోష్….
తొలివన్డేలో నెగ్గిన జోష్ తో ఆతిథ్య కంగారూ టీమ్ సిరీస్ కు గురిపెడితే…తొలి ఓటమితో కంగుతిన్న టీమిండియా మాత్రం…సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే…ఆరునూరైనా రెండో వన్డేలో నెగ్గి తీరాల్సి ఉంది. రేపు ఉదయం 9 గంటలకు ఈ పోటీ ప్రారంభమవుతుంది.
విజయమే లక్ష్యంగా టీమిండియా…
ఆసీస్ దే తొలిదెబ్బ….
సిడ్నీ గ్రౌండ్స్ లో ముగిసిన తొలివన్డే లో 34 పరుగుల ఓటమితో కంగుతిన్న టీమిండియా…లోపాలను సవరించుకొని…స్థాయికి తగ్గట్టుగా ఆడటం ద్వారా ..కంగారూల పనిపట్టాలన్న కసితో ఉంది.
అడిలైడ్ వన్డేలో టీమిండియా నెగ్గాలంటే…టాపార్డర్ అత్యుత్తమ స్థాయిలో రాణించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
తొలి వన్డేలో దారుణంగా విఫలమైన ఓపెనర్ శిఖర్ ధావన్, వన్ డౌన్ విరాట్ కొహ్లీ, రెండో డౌన్ రాయుడుల సత్తాకు ఈ రెండో వన్డే సవాలుగా మారింది.
మరో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ధోనీ హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా తమ ఫామ్ ను చాటుకోగలిగారు.
సిరాజ్ కు చాన్స్ దక్కేనా?
ఇక…బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలకు తోడుగా తుది జట్టులో చోటు కోసం…హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఎదురుచూస్తున్నాడు.
మరో వైపు…ఆతిథ్య ఆస్ట్రేలియా మాత్రం…తొలివన్డే నెగ్గిన జోష్ తో వరుసగా రెండో విజయానికి తహతహలాడుతోంది. అడిలైడ్ వన్డేలో సైతం విజయం సాధించడం ద్వారా… సిరీస్ ను 2-0తో ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.
తొలివన్డేలో పాల్గొన్న జట్టునే …రెండోమ్యాచ్ లో సైతం కొనసాగించాలని కంగారూ టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది.
టాస్ మరోసారి కీలకమే… అడిలైడ్ ఓవల్ లో సైతం టాస్ కీలకం కానుంది. టాస్ నెగ్గిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని… ప్రత్యర్థికి భారీ టార్గెట్ తో సవాల్ విసిరే వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది.
భారత కాలమానం ప్రకారం…మంగళవారం ఉదయం 9 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
విరాట్ సేన ఈమ్యాచ్ లో నెగ్గడం ద్వారా…సిరీస్ ను 1-1తో సమం చేయడంతో పాటు…అభిమానులకు సంక్రాంతి కానుకగా… అడిలైడ్ వన్డే విజయాన్ని ఇవ్వాలని కోరుకొందాం.