డీఎల్ విషయంలో నేతలకు స్పష్టత ఇచ్చిన జగన్
కడప జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి విషయంలో జగన్ స్పష్టత ఇచ్చారు. పులివెందులకు వెళ్తున్న సమయంలో శనివారం వైఎస్ జగన్‌కు… మైదుకూరు నియోజకవర్గానికి చెందిన డీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ తిరుపాల్ రెడ్డి బృందం ఒక గ్రామం వద్ద స్వాగతం పలికారు. ఈ సమయంలో వారు డీఎల్ అంశాన్ని జగన్ వద్ద ప్రస్తావించారు. డీఎల్‌ను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇస్తే తిరుగుండదు… 50వేల ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని జగన్‌కు వివరించారు. జగన్ మాత్రం వచ్చే […]
కడప జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి విషయంలో జగన్ స్పష్టత ఇచ్చారు. పులివెందులకు వెళ్తున్న సమయంలో శనివారం వైఎస్ జగన్‌కు… మైదుకూరు నియోజకవర్గానికి చెందిన డీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ తిరుపాల్ రెడ్డి బృందం ఒక గ్రామం వద్ద స్వాగతం పలికారు.
ఈ సమయంలో వారు డీఎల్ అంశాన్ని జగన్ వద్ద ప్రస్తావించారు. డీఎల్‌ను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇస్తే తిరుగుండదు… 50వేల ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని జగన్‌కు వివరించారు.
జగన్ మాత్రం వచ్చే ఎన్నికల్లోనూ మైదుకూరు టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రఘురామిరెడ్డికే ఇస్తామని స్పష్టం చేశారు. కష్టకాలంలోనూ పార్టీని నమ్ముకుని పనిచేసిన రఘురామిరెడ్డిని పక్కన పెట్టలేనని వివరించారు.
డీఎల్ రవీంద్రారెడ్డి పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని జగన్ చెప్పారు. రఘురామిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి… డీఎల్‌కు ఎమ్మెల్సీ దక్కేలా చూస్తామని మైదుకూరు నేతల బృందానికి జగన్ వివరించారు