క్రికెటర్ అంబటి రాయుడికి షాక్‌

టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడికి ఐసీసీ షాక్ ఇచ్చింది. నోటీసులు జారీ చేసింది. శనివారం సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అంబటి రాయుడు బౌలింగ్‌ విషయంలో ఈ నోటీసులు వచ్చాయి. మ్యాచ్‌లో అంబటి రెండు ఓవర్లు బౌలింగ్ చేశారు. అయితే అంబటి రాయుడు బౌలింగ్ అనుమానాస్పదంగా ఉందని మ్యాచ్ రిఫరీ ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై ఐసీసీ స్పందించింది. రెండు వారాల్లోగా బౌలింగ్ యాక్షన్ నిరూపించుకోవాలని అంబటి రాయుడిని ఆదేశించింది. దీంతో అంబటి రాయుడు చిక్కుల్లో […]

Advertisement
Update:2019-01-13 09:42 IST

టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడికి ఐసీసీ షాక్ ఇచ్చింది. నోటీసులు జారీ చేసింది. శనివారం సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అంబటి రాయుడు బౌలింగ్‌ విషయంలో ఈ నోటీసులు వచ్చాయి.

మ్యాచ్‌లో అంబటి రెండు ఓవర్లు బౌలింగ్ చేశారు. అయితే అంబటి రాయుడు బౌలింగ్ అనుమానాస్పదంగా ఉందని మ్యాచ్ రిఫరీ ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై ఐసీసీ స్పందించింది. రెండు వారాల్లోగా బౌలింగ్ యాక్షన్ నిరూపించుకోవాలని అంబటి రాయుడిని ఆదేశించింది.

దీంతో అంబటి రాయుడు చిక్కుల్లో పడ్డాడు. ఐసీసీ ఆదేశాలపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు. బౌలింగ్ యాక్షన్ పరీక్షల ఫలితాలు వెలువడే వరకు అంబటి రాయుడు బౌలింగ్ చేసేందుకు వెసులుబాటు ఉంది. సిడ్నీ మ్యాచ్‌లో 22, 24 ఓవర్లలో అంబటి బౌలింగ్ చేసి 13 పరుగులు ఇచ్చాడు.

Tags:    
Advertisement

Similar News