సంక్రాంతి సినిమాల ఓవర్సీస్ రిపోర్ట్
సంక్రాంతి సినిమాలన్నీ వరుసపెట్టి వచ్చేశాయి. 9న కథానాయకుడు, 10న పేట, 11న వినయ విధేయ రామ, 12న ఎఫ్2 వచ్చేశాయి. ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా ఎలా ఉందనే విషయంపై అందరికీ ఇప్పటికే ఓ అవగాహన వచ్చేసింది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమాల పరిస్థితేంటో చూద్దాం. అందరికంటే ముందు విడుదలవ్వడం ఎన్టీఆర్-కథానాయకుడికి ప్లస్ అయింది. ఆ సినిమాకు ఓవర్సీస్ లో మంచి స్క్రీన్స్ దొరకడంతో వసూళ్లు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. ఇక కథానాయకుడు తర్వాత […]
సంక్రాంతి సినిమాలన్నీ వరుసపెట్టి వచ్చేశాయి. 9న కథానాయకుడు, 10న పేట, 11న వినయ విధేయ రామ, 12న ఎఫ్2 వచ్చేశాయి. ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా ఎలా ఉందనే విషయంపై అందరికీ ఇప్పటికే ఓ అవగాహన వచ్చేసింది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమాల పరిస్థితేంటో చూద్దాం.
అందరికంటే ముందు విడుదలవ్వడం ఎన్టీఆర్-కథానాయకుడికి ప్లస్ అయింది. ఆ సినిమాకు ఓవర్సీస్ లో మంచి స్క్రీన్స్ దొరకడంతో వసూళ్లు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. ఇక కథానాయకుడు తర్వాత విడుదలైన పేట సినిమాను మాత్రం ఓవర్సీస్ ఆడియన్స్ పట్టించుకోలేదు. అయితే ఈ సినిమా తమిళ వెర్షన్ మాత్రం ఓవర్సీస్ లో రికార్డులు సృష్టిస్తోంది.
ఇక చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమా ఓవర్సీస్ లో అట్టర్ ఫ్లాప్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో సి-సెంటర్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని తీసిన ఈ సినిమా ఓవర్సీస్ లో డిజాస్టర్ అయింది.
ఇక లాస్ట్ లో వచ్చిన ఎఫ్2 మాత్రం ఓవర్సీస్ లో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. వెంకీ, వరుణ్ కలిసి చేసిన కామెడీకి ఓవర్సీస్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. అలా ఓవర్సీస్ లో ఈ సంక్రాంతికి ఎన్టీఆర్-కథానాయకుడు ఫర్వాలేదనిపించుకుంటే.. ఎఫ్2 బ్లాక్ బస్టర్ హిట్ అయింది.