టీమిండియా అభిమానుల నిర్భంధం
టీమిండియాకు మద్దతు పలికిన వారిని దండించబోయి ఓ దుబాయ్ షేక్ ఇరుక్కుపోయాడు. పంజరం లాంటి నిర్మాణంలో టీమిండియా అభిమానులను బంధించి…. చివరకు పోలీసు కేసు వరకు పరిస్థితిని తెచ్చుకున్నాడు. యూఏఈలో ఏషియన్ పుట్‌బాల్ కప్ సిరీస్‌లో భాగంగా యూఏఈ- భారత్ మధ్య గురువారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయిందన్న సంగతి పక్కన పెడితే… యూఏఈ మీద అభిమానంతో ఒక షేక్ టీమిండియా అభిమానులను బంధించాడు. మీరు ఏ జట్టుకు మద్దతు పలుకుతారని ప్రశ్నించగా… అతడి […]
టీమిండియాకు మద్దతు పలికిన వారిని దండించబోయి ఓ దుబాయ్ షేక్ ఇరుక్కుపోయాడు. పంజరం లాంటి నిర్మాణంలో టీమిండియా అభిమానులను బంధించి…. చివరకు పోలీసు కేసు వరకు పరిస్థితిని తెచ్చుకున్నాడు.
యూఏఈలో ఏషియన్ పుట్‌బాల్ కప్ సిరీస్‌లో భాగంగా యూఏఈ- భారత్ మధ్య గురువారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయిందన్న సంగతి పక్కన పెడితే… యూఏఈ మీద అభిమానంతో ఒక షేక్ టీమిండియా అభిమానులను బంధించాడు.
మీరు ఏ జట్టుకు మద్దతు పలుకుతారని ప్రశ్నించగా… అతడి వద్ద పనిచేస్తున్న వారు టీమిండియాకు అని బదులిచ్చారు. దీంతో షేక్… వారిని పంజరం లాంటి నిర్మాణంలో వేసి క్లాస్ పీకాడు. వారితో యూఏఈకి జై కొట్టించాడు. అలా యూఏఈ జట్టుకు వారు జై కొట్టగానే బయటకు వదిలేశాడు. ఈ వీడియో బయటకు రావడంతో పోలీసులు సీరియస్‌గా స్పందించారు.
తమ ముందు హాజరుకావాల్సిందిగా షేక్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో షేక్ తాను అదంతా సరదా కోసం చేశానని మాట మార్చాడు. తాను పంజరంలో బంధించిన వారంతా 20 ఏళ్లుగా తన వద్ద పనిచేస్తున్నారని… సరదాగా ఆ వీడియో చేశామని చెప్పుకొచ్చారు. తామంతా కలిసే ఉంటున్నామని… తామంతా కలిసే భోజనాలు చేస్తుంటామని వివరణ ఇచ్చారు. పోలీసులు మాత్రం విచారణకు హాజరుకావాల్సిందేనని ఆదేశించారు.