జయ ఎస్టేట్ వరుస మరణాల వెనుక సీఎం

తెహల్కా మాజీ ఎడిటర్ మాథ్యూ శామ్యుల్‌ చేసిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది. జయలలితకు చెందిన నీలగిరి జిల్లాలోని కొడనాడు ఎస్టేట్ వ్యవహారంలో అనుమానాస్పద మరణాల వెనుక సీఎం పళనిస్వామి హస్తముందన్నది ఆ ఇంటర్వ్యూ సారాంశం. ఇంటర్వ్యూలో ఈ ఆరోపణలు చేసిన వ్యక్తి ఎవరో కాదు. ఎస్టేట్ , అనుమానాస్పద మృతుల కేసులో నిందితుడిగా ఉన్న సయాన్‌. కేరళకు చెందిన సయాన్‌ తన ఇంటర్వ్యూలో పలు ఆంశాలు వెల్లడించారు. ఈ వీడియోలను తెహల్కా విడుదల […]

Advertisement
Update:2019-01-12 04:28 IST

తెహల్కా మాజీ ఎడిటర్ మాథ్యూ శామ్యుల్‌ చేసిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది. జయలలితకు చెందిన నీలగిరి జిల్లాలోని కొడనాడు ఎస్టేట్ వ్యవహారంలో అనుమానాస్పద మరణాల వెనుక సీఎం పళనిస్వామి హస్తముందన్నది ఆ ఇంటర్వ్యూ సారాంశం. ఇంటర్వ్యూలో ఈ ఆరోపణలు చేసిన వ్యక్తి ఎవరో కాదు. ఎస్టేట్ , అనుమానాస్పద మృతుల కేసులో నిందితుడిగా ఉన్న సయాన్‌. కేరళకు చెందిన సయాన్‌ తన ఇంటర్వ్యూలో పలు ఆంశాలు వెల్లడించారు.

ఈ వీడియోలను తెహల్కా విడుదల చేయడంతో తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో దోపిడి తర్వాత జరిగిన మరణాల వెనుక సీఎం హస్తముందని సయాన్ వివరించారు. కొడనాడు ఎస్టేట్‌కు సంబంధం ఉన్న వ్యక్తులు వరుసగా ప్రాణాలు కోల్పోవడం వెనుక సీఎం ప్రమేయం ఉందని ఆరోపించారు.

జయ చనిపోయిన తర్వాత ఎస్టేట్‌ వద్ద కాపాలాగా ఉన్న వ్యక్తి అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. ఎస్టేట్‌లో సీసీ కెమెరా ఫుటేజ్‌ను పర్యవేక్షించే యువకుడు హఠాత్తుగా ఉరేసుకుని చనిపోయాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన జయ మాజీ కారు డ్రైవర్ కనకరాజ్‌ కూడా అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న సయాన్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో సయాన్‌ తీవ్ర గాయాలతో బయటపడినా అతడి భార్య, కుమార్తె మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఇలా వరుసగా ఈ వ్యవహారంతో ఉన్న వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడడం వెనుక ఏదో అదృశ్య శక్తి ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కేసులో నిందితుడిగా ఉన్న సయాన్‌…ఈ వ్యవహారం వెనుక సీఎం పళనిస్వామి ఉన్నారని చెప్పడం సంచలనంగా మారింది.

ఈ ఇంటర్వ్యూపై అన్నాడీఎంకే మండిపడింది. ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా ఇంటర్వ్యూను చేశారని మంత్రి జయకుమార్ ఆరోపించారు. తెహల్కాపై కేసు వేస్తామని ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News