ఇకపై రాంగ్ రూట్‌లో వస్తే పగిలిపోద్ది... కొత్త సిస్టమ్....
రాంగ్ రూట్‌లో ఇష్టానికి వాహనాలను నడిపే వారి పప్పులు ఇకపై ఉడకవు. పట్టణాల్లో రాంగ్ రూట్ చోదకుల ఆటకట్టిచేందుకు చర్యలు ముమ్మరం అయ్యాయి. రాంగ్ రూట్‌లో వాహనాలను నడపకుండా నిరోధించేందుకు టైర్ కిల్లర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పుణేలో వీటిని ఏర్పాటు చేశారు. రెండో నగరంగా నోయిడాలో టైర్ కిల్లర్ల ఏర్పాటు వేగంగా కొనసాగుతోంది. ఈ టైర్ కిల్లర్ల ఏర్పాటును ప్రజలు స్వాగతిస్తున్నారు. రాంగ్ రూట్‌లో వెళ్లి ట్రాఫిక్‌ను అస్తవ్యస్థం చేసే పరిస్థితి ఇకపై ఉండకుండా ఈ […]
రాంగ్ రూట్‌లో ఇష్టానికి వాహనాలను నడిపే వారి పప్పులు ఇకపై ఉడకవు. పట్టణాల్లో రాంగ్ రూట్ చోదకుల ఆటకట్టిచేందుకు చర్యలు ముమ్మరం అయ్యాయి. రాంగ్ రూట్‌లో వాహనాలను నడపకుండా నిరోధించేందుకు టైర్ కిల్లర్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటికే పుణేలో వీటిని ఏర్పాటు చేశారు. రెండో నగరంగా నోయిడాలో టైర్ కిల్లర్ల ఏర్పాటు వేగంగా కొనసాగుతోంది. ఈ టైర్ కిల్లర్ల ఏర్పాటును ప్రజలు స్వాగతిస్తున్నారు.
రాంగ్ రూట్‌లో వెళ్లి ట్రాఫిక్‌ను అస్తవ్యస్థం చేసే పరిస్థితి ఇకపై ఉండకుండా ఈ టైర్ కిల్లర్లు అడ్డుకుంటాయి. రోడ్డుకు అడ్డంగా ఈ టైర్ కిల్లర్లను ఏర్పాటు చేస్తారు. సరైన రూట్‌లో వాహనం వెళ్తే ఇబ్బంది ఏమీ ఉండదు. సరైన దిశలోనే వాహనాలు వస్తే టైర్ కిల్లర్లకు ఏర్పాటు చేసిన పదునైన పళ్లు కిందకు ఒంగుతాయి.
అదే రాంగ్ రూట్‌లో టైర్ కిల్లర్‌కు ఎదురుగా వాహనం వస్తే మాత్రం కొత్త టైర్ కొనుక్కోవాల్సిందే. ఎదురుగా వచ్చే వాహన టైర్లకు టైర్ కిల్లర్‌కు అమర్చిన పళ్లు కుచ్చుకుంటాయి. దీంతో టైర్ డ్యామేజ్ అయిపోతుంది.
నోయిడా, పుణేలో ఈ ప్రయోగం మంచి ఫలితాలనే ఇస్తోంది. వాహనదారులను ముందే హెచ్చరించేందుకు టైర్ కిల్లర్లు ఉన్నట్టుగా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తారు. అయినా సరే లెక్కచేయకుండా రాంగ్ రూట్‌లో వెళ్తే కొత్త టైర్లు కొనాల్సిందే.